పల్లవి:
పిలుస్తున్నది పిలుస్తున్నది
బడి ఈడు పిల్లలను పిలుస్తున్నది
చదువులమ్మ రమ్మని పిలుస్తున్నది
చదువులెల్ల కమ్మగ నేర్వమన్నది
//పిలు//
చరణం:1
సప్త వర్ణాలతో సొగసుగున్నది
సప్త స్వరాలతో విందుగున్నది
పచ్చని తరువులతో హాయిగున్నది
మచ్చలేని గురువుల బోధనున్నది
//పిలు//
చరణం:2
‘నాడు నేడు’ సర్వ సౌఖ్యమున్నది
‘ విద్యాకానుక’ బహు ముద్దుగున్నది
‘జగనన్న గోరుముద్ద’ రుచిగున్నది
‘విద్యా వసతి దీవెన’ విలువైనది
//పిలు//
చరణం:3
కోకిలలా కమ్మగ పాడమన్నది
నెమలిలా నాట్యమే చేయమన్నది
ఆట పాటల్లో ఆనందముంది
ప్రతిభ పాటవాల్లో అభినందనుంది
//పిలు//
చరణం:4
దేశభక్తి తోటే మెలగమన్నది
గురుభక్తితోడనే బ్రతక మన్నది
భయభక్తులతోనే చదవమన్నది
పొందిన మేలెన్నడు మరువకన్నది
//పిలు//
– గుండాల నరేంద్రబాబు
తెలుగు ఉపాధ్యాయులు 9493235992.




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల