- భైంసా మీదుగా కారుండా నిర్మల్ మీదుగా వెళ్లాలరి వెల్లడి
- షరతులతో కూడిన అనుమతి మంజూరు
- కేవలం 500 మందితో మాత్రమే యాత్రకు అనుమతి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించనున్న ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. పాదయాత్ర భైంసాలో నుంచి వెళ్ళకూడదని స్పష్టం చేసింది. నిర్మల్ వి•దుగా పాదయాత్రకు వెళ్లాలని తెలిపింది. ప్రజాసంగ్రామ యాత్రకు సంబంధించిన బహిరంగ సభ కూడా భైంసాకు 3 కిలోవి•టర్ల దూరంలో జరుపుకోవాలని న్యాయస్థానం సూచించింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య మాత్రమే సభ జరుపుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 500 మందితో మాత్రమే పాదయాత్ర చేయాలని..3 వేల మందితోనే సభ జరుపుకోవాలని హైకోర్టు నిర్దేశిరచింది. బీజేపీ నేతలు, కార్యకర్తలు ఇతర వర్గాలను రెచ్చగొట్టేలా మాట్లాడొద్దని సూచించింది. కార్యకర్తలు కర్రలు, వెపన్స్ వాడొద్దని తెలిపింది. లా అండ్ ఆర్డర్‌ను పోలీసులు కాపాడాలని ఆదేశించింది. అంతకుముందు సెక్యూరిటీ రీజన్స్ పేరుతో పోలీసులు బండి పాదయాత్రకు ఒక్కరోజు ముందు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పాదయాత్రకు అనుమతిం చేలా ఆదేశించాలని కోరింది. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం పాదయాత్ర కొనసాగించేందుకు ఈ మేరకు అనుమతిచ్చింది. హైకోర్టులో బీజేపీ తరపున రామచందర్ రావు వాదనలు వినిపించారు. బైంసా లోపలి నుంచి పాదయాత్ర వెళ్ళదని కోర్టుకు తెలిపారు. రూట్ మ్యాప్ వివరాలు కోర్టుకు సమర్పించారు. బైంసా వై జంక్షన్ నుంచి పాదయాత్ర వెళ్తుందన్నారు. బైంసా టౌన్లోకి పాదయాత్ర ఎంటర్ కాదని స్పష్టం చేశారు. బైంసా టౌన్ లోకి ఎంటర్ కానప్పుడు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. బైంసా చాలా సున్నితమైన ప్రాంతమని అడ్వకేట్ జనరల్ బిఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు. అయితే వాదనలు విన్న అనంతరం హైకోర్టు షరతులతో అనుమతినిచ్చింది.




