ఉప్పల్ , ప్రజాతంత్ర, నవంబర్ 4: బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కారు గుర్తుకే ఓటు వేసి,ఉప్పల్ బి ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని దేవేందర్ రెడ్డి అభ్యర్థించారు.బండారు లక్ష్మారెడ్డి నీ గెలిపించాలని మల్లాపూర్ డివిజన్ పరిధిలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరిస్తూ, స్థానిక కాలనీల్లో చేసిన అభివృద్ధి పనులను తెలియజేస్తూ ప్రచార కార్యక్రమాన్ని ఉదృతం చేశారు. డివిజన్ పరిధిలోని అన్నపూర్ణ కాలనీ, లింగమయ్య నగర్ కాలనీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానికులు నీరజ్, శివ తదితరులకు బి ఆర్ ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.కార్యక్రమంలో స్థానిక బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాళ్లు పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి బి ఆర్ ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, స్థానిక కాలనీ అభివృద్ధి పనుల వివరిస్తూ ప్రచారం చేశారు.
బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా మల్లాపూర్ లో ఇంటింటికి ప్రచారం పన్నాల దేవేందర్ రెడ్డి




