పటాన్ చెరు, ప్రజాతంత్ర, ఆగస్ట్ 15: బండలగూడ పారిశ్రామిక వాడ లో మంగళవారం స్వాతంత్ర దినోత్సవం వేడుకలు కార్మికులు సంబరంగా జరుపుకున్నారు.సంతోషిమాత ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామచంద్రపురం మాజీ ఎంపీపీ, బీఅర్ టి యు రాష్ట్ర కార్యదర్శి నాలకంటి యాదగిరియాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటాన్ చెరు నియోజక వర్గం లో పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులు, ఆటో డ్రైవర్లు, వివిధ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ అండగా ఉండి, కార్మికుల హక్కుల సాధన కోసం తోడ్పాటును అందిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్, వసంత్, కాంతారావు, నగేశ్, శ్రీనివాస్, బాబురావు, హరి,రఘు, ఎల్లేష్, ఊర్మిళ, గౌరీ, పద్మ, మేరీ, ఆటో డ్రైవర్లు, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.




