ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు

లోతైన దర్యాప్తుతో వెలుగులోకి సంచలన విషయాలు
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ట్యాపింగ్‌
రాధాకిషన్‌ రావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం
ఫలితాల తరవాత హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం
హైదరాబాద్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడి


హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌4 : పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ..సంచలన విషయాలు వెలుగులోకి వొస్తున్నాయి. తాజాగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఫామ్‌ హౌస్‌ ఎపిసోడ్‌ తెరపైకి వొచ్చింది. ఈ కేసుకు సంబంధించి హైదరా బాద్‌ వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌ కుమార్‌ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గురువారం నాడు ఆయన వ్నిడియాకు పలు విషయాలను వెల్లడిరచా రు. మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావును కోర్టు అనుమతితో తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. 10 తేదీ వరకు టాస్క్‌ ఫోర్స్‌ రాధాకిషన్‌ రావును విచారిస్తుందని వెస్ట్‌ జోన్‌ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డీసీపీ తెలిపారు. ఎస్‌ఐబీలో హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రధారుడిగా రాధాకిషన్‌ రావు ఉన్నారని చెప్పారు. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల ప్రొఫైళ్లను అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు.
ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురి ప్రొఫైళ్లని రాధాకిషన్‌ రావు తయారు చేశాడని వెస్ట్‌జోన్‌ డీసీపీ వెల్లడిరచారు. ఆయన బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడన్నారు. కాంగ్రెస్‌కి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయించాడన్నారు.ళిందులోప్రభాకర్‌రావుకి రాధాకృష్ణ సహకరించాడని చెప్పారు. పలువురి ప్రొఫైల్స్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటకు రాకుండా ఉండటానికి ఆధారాలను ధ్వంసం చేశారని తెలిపారు. కాగా..ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోమాజీ డీసీపీ రాధ కిషన్‌ రావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందని, ఫామ్‌ హౌస్‌ ఎపిసోడ్‌ పూర్తిగా ఫోన్‌ ట్యాపింగ్‌ వల్లే జరిగినట్లు హైదరాబాద్‌ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌ హౌస్‌లో ఆపరేషన్‌ కంటే ముందు రాధాకిషన్‌ రావు 74 డివైసులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌ నడిచినట్లు తెలుస్తుంది. ఈ వ్యవహారం రాధాకిషన్‌ రావు పరిధిలో లేకపోయినా గత కేసీఆర్‌ ప్రభుత్వం ఆయన కనుసన్నుల్లోనే నడిపించినట్లు తెలుస్తుంది. నంద కుమార్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి ఫామ్‌ హౌస్‌ ఎపిసోడ్‌కు రాధాకిషన్‌ రావు స్కెచ్‌ వేసినట్లు సమాచారం.
ఈ కేసులో భాగంగానే సీసీటీవీ కెమెరాలను ఐటీ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి రమేష్‌ రావు మానిటరింగ్‌ చేసినట్లు తెలుస్తుంది. రాధకిషన్‌ రావుని కస్టడీకి అనుమతిస్తే మొదట ఫామ్‌ హౌస్‌ కేసుపై హైదరాబాద్‌ పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, స్పై కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ డివైస్‌ను రాధాకిషన్‌ రావు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మునుగోడు ఉపఎన్నికల హడావుడిలో ఉన్న సమయంలో హైదరాబాద్‌లో నలుగురు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో సంప్రదింపులకు సంబంధించి వ్యక్తులను అరెస్టు చేసిన కేసులో సంచలన విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు మూలం ఫోన్‌ ట్యాపింగేనని కస్టడీలో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌ రావు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు, గువ్వల బాలరాజు, రోహిత్‌ రెడ్డి, రేగా కాంతారావు, బీరం హర్షవర్ధన్‌ రెడ్డిల ఫోన్లు ట్యాప్‌ చేశారు. వారు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలియగానే..ప్రణీత్‌ రావు ప్రభుత్వ పెద్దలకు తెలియచేసినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత రాధాకిషన్‌ రావుతో కలిసి స్పెషల్‌ ఆపరేషన్‌కు ప్లాన్‌ చేశారని భావిస్తున్నారు. నందకుమార్‌తో పాటు స్వామిజీని..అప్పటి తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌కు పిలిపించారు. అంతకు ముందే ఎమ్మెల్యేలతో బీఆర్‌ఎస్‌ హైకమాండ్‌ ఈ అంశంపై మాట్లాడిరది. బేరాల గురించి మొత్తం తెలిసిపోయిందని.. రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకునేందుకు సహకరించాలని సూచించినట్లుగా తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *