ఫోన్‌ ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారం చర్యలు

వర్షాన్ని, కరువును రాజకీయం చేస్తున్నారు
వాటికి కారణం కాంగ్రెస్‌ కాదు
వాస్తవాలకు భిన్నంగా హరీష్‌ రావు మాటలు
బిఆర్‌ఎస్‌పై మంత్రి పొన్నం ఫైర్‌

సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 27 : ఫోన్‌  ట్యాపింగ్‌ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామనీ రాష్ట్ర బిసి, రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ తెలిపారు. బుధవారం సిద్ధిపేటలోని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, సిద్ధిపేట అసెంబ్లీ ఇంఛార్జి పూజల హరికృష్ణ,  పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమాంతో కలిసి ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడుతూ… ఫోన్‌ ట్యాపింగ్‌ చేయడం చట్ట విరుద్ధమని, అలా చేస్తూ కొందరు రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. వర్షాన్ని, కరువును కూడా బిఆర్‌ఎస్‌ పార్టీ రాజకీయం చేస్తుందని, 2020లో వర్షపాతం ఎంత..2023లో వర్షపాతం ఎంత..అని బేరీజు వేసుకుని మాట్లాడాలని సూచించారు. కరువుకు బిఆర్‌ఎస్‌ కారణం అంటలేమనీ, అలాగని కాంగ్రెస్‌ కూడా కారణం కాదన్నారు. వర్షాలకు ప్రకృతి కారణమనీ, దీనిని  రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హరీష్‌ రావు మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నాడనీ, కాంగ్రెస్‌ వొచ్చిన తరువాత కరువు రాలేదన్నారు. అరేబియాలో ఏర్పడిన ఎల్‌నినో కారణంగా వర్షపాతం తగ్గిందన్నారు. గతంలో 1091. 8ఎంఎంలో  వర్షపాతం నమోదైందన్నారు. ఈసా రి చాలా తక్కువ వర్షపాతం నమోదైం దన్నా రు. గత సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయని అన్నారు. డబుల్‌ బెడ్‌ రూంలు కట్టిన వారిని వారు వోట్లు అడగాలని, అలాగే ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊర్లలో తాము వోట్లు అడుగుతామన్నారు. 5 ఎకరాలలోపు భూమి ఉన్న వారికి రైతుబంధు పడిరదనీ, మిగిలిన వారికి కూడా వేస్తామన్నారు. బిఆర్‌ఎస్‌ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైందన్నారు. గతంలో రైతుబంధు మార్చి నెల వరకు వేశారన్నారు. చిన్న చిన్న పనులు చేసిన పెండిరగ్‌లో బకాయిలు ఉన్నాయనీ, 40 వేల కోట్ల రూపాయల పనులు బకాయిలను కాంగ్రెస్‌ పార్టీపైన పెట్టిందన్నారు.

అధికారం నుండి వెళ్లేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పులు చేయడంతో పాటు 40వేల కోట్ల  బకాయిలు పడిరదన్నారు. హాస్టల్‌లో ఉన్న పిల్లలకు మెస్‌ బిల్లులు కూడా చెల్లించలేకపాయిందనీ, పంట బీమా పథకం పెట్టకపోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందనీ, పంటల బీమా పథకం పెట్టి ఉంటే రైతులు చనిపోయే వారు కాదు కదా అన్నారు. రైతులకు మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాలు ఇలా ఎదీ ఉన్నా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కోర్టు తీర్పు ఇస్తే కూడా వారు రైతులకు నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని నిలదీశారు. ప్రభుత్వాలు కలిసి పని చేయాలనీ, బిఆర్‌ఎస్‌ వారికి ప్రధాని వొచ్చినా కలిసే పరిస్థితి లేదన్నారు. అధికార పార్టీలతో వారికి సంబంధం లేదన్నారు. తాము కేంద్రంతో సత్సంబంధాలు కలిగి ఉండి కేంద్రం నుండి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు. మెట్రో, మూసి, తాగు నీటి సమస్య  తదితర అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా 100శాతం నీరు ఇచ్చామని కేంద్రానికి నివేదిక ఇచ్చారనీ, ఇప్పుడు ఎక్కడికక్కడ ఇళ్లకు నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడిరదన్నారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా కాపాడుతూ సప్లయ్‌ చేస్తున్నామన్నారు.  సిఎస్‌ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ రాగానే కరువు తెచ్చిందన్న మూర్ఖులకు ఆ విషయమే చెబుతున్నానని, రైతాంగానికి నష్టపరిహారంకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

రైతుబంధు ఇచ్చిన వాళ్లని తాము వోట్లు అడుగుతామని, ఇవ్వని వాళ్లని వారు వోట్లు అడగండన్నారు. కాళేశ్వరం కృంగిపోయిందని, వారి హయాంలో జరిగిన ప్రాజెక్ట్‌ ఏం జరిగిందో కూడా చెప్పలేదన్నారు. నష్టం ఏంటి అనేది చెప్పకుండా కుట్ర కోణం దాగి ఉందని కేసు పెట్టారన్నారు. మరి కుట్ర కోణం ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. ఆర్టీసిలో 35 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారనీ,  200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, 500 రూపాయలకే గ్యాస్‌ అందిస్తున్నామన్నారు. 10 సంవత్సరాల బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో రేషన్‌ కార్డులు ఇవ్వలేదనీ, తాము రేషన్‌ కార్డులు ప్రాసెస్‌ స్టార్ట్‌ చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామనీ, నియంతృత్వంగా  పాలించిన వారు  ప్రభుత్వం ఏర్పడి నెలలు కూడా కాకముందే కూలిపోతుందని అపశకునాలు పెడుతున్నారన్నారు. ఆర్టీసిని నాశనం చేసిందే బిఆర్‌ఎస్‌ వారని, తాము ఆర్టీసిని లాభాల్లోకి తీసుకొస్తున్నామన్నారు. టెట్‌ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందనీ, ఎక్కడ సమస్యలు లేకుండా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ తెలిపారు. ఈ  సమావేశంలో కాంగ్రెస్‌ నాయకులు గంప మహేందర్‌, ఎన్‌.శివప్ప, బొమ్మల యాదగిరి, కలీమొద్దీన్‌, లక్కరసు సూర్యవర్మ, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *