ఫోటో వీడియో గ్రాఫర్లకు రూ.5 లక్షల ఉచిత ఇన్సూరెన్స్ సదుపాయం

పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 19: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రామచంద్రాపురం పట్టణంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యురాలు సి.గోదావరి అంజిరెడ్డి పలువురు ఫోటోగ్రాఫర్లరను ఘనంగా సన్మానించి, మెమొంటోలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. మనిషి జీవన ప్రస్థానంలో మధుర జ్ఞాపకంగా నిలిచేవి ఫోటోలు అని, కరిగే కాలంలో చెదిరిపోని స్మృతులకు ప్రతిబింబాలు ఫోటోలు మాత్రమేనని అన్నారు. టెక్నాలజీ ఎంతగా అందుబాటులోకి వచ్చినా ఫోటోకు ఉన్న ప్రాముఖ్యత ఏ మాత్రం తగ్గలేదని పేర్కొన్నారు. లక్ష మాటల్లో చెప్పలేనిది భావాన్ని ఒక్క ఫోటోతో చెప్పవచ్చని అన్నారు. అది ఫోటోగ్రఫీకి ఉన్న గొప్పనతం అని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఫోటోగ్రాఫర్ కు రూ.5 లక్షల ప్రమాద బీమా ఉచితంగా అందజేయనున్నట్లు ఈ  సందర్భంగా గోదావరి అంజిరెడ్డి ప్రకటించారు. ఈ సదావకాశాన్ని పటాన్ చెరు నియోజకవర్గంలో ఫోటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లు అందరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సురేందర్, మల్లేష్, బసవమ్మ, గీత, ఫోటోగ్రాఫర్ల అధ్యక్షుడు కృష్ణ యాదవ్, పెంటేష్, అఖిల్, ఆంజనేయులు, రియాజ్, ప్రవీణ్, వీరన్న, సతీష్, కిషన్, హనుమంతు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *