ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 13 : ఆమనగల్లు కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫోటో ఖలీల్ ఇటీవల అనారోగ్యతో బాధపడుతూ వెల్దండ మండలంలోని యెన్నం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు చల్లా వంశీ చంద్ రెడ్డి ఖలీల్ ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సూదిని రాంరెడ్డి, పిసిసి సభ్యులు ఆ ఇళ్ల శ్రీనివాస్ గౌడ్, ఆమనగల్ మాజీ జెడ్పిటిసి శ్రీనివాసరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహ, యేన్నమ్ ఆసుపత్రి చైర్మన్ హరికాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఫోటో ఖలీల్ ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే





