ఫోక్సో కేసులో నేరస్తునికి 3 సంవత్సరాల జైలు శిక్ష,  1500/-  రూపాయల జరిమానా

పోలీస్ స్టేషన్ సిద్దిపేట త్రీ టౌన్
నేరస్థుడు మండల రాములు తండ్రి బాలయ్య, వయస్సు 70 సంవత్సరములు, మండలం సిద్దిపేట
సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 8:  త్రీటౌన్ సీఐ భాను ప్రకాష్   కేసు యొక్క వివరాలు తెలుపుతూ పై నేరస్థుడు 12-06-2021 నాడు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో మైనర్ అమ్మాయి బట్టలు విప్పి అసభ్యంగా ప్రవర్తించినాడని అమ్మాయి తల్లి  దరఖాస్తు ఇవ్వగా అప్పటి ఎస్ఐ సంపత్, కేసు నమోదు చేసుకుని పరిశోధన ప్రారంభించి పై నేరస్తుని అరెస్టు చేసి జ్యుడీషియల్  రిమాండ్ కు పంపించడం జరిగింది. కేసు తదుపరి పరిశోధన పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్  వేయడం జరిగింది.
ఆరోజు నుండి ఈరోజు వరకు సిద్దిపేట 1st (ఏడీజే) అడిషనల్ డిస్టిక్, సెషన్స్ జడ్జ్ కోర్టులో కేసు విచారణ జరిగింది.ఆరోజు నుండి ఈరోజు వరకు కేసు విచారణ జరిగింది. 1st (ఏడీజే) అడిషనల్ డిస్టిక్  సెషన్స్ జడ్జ్  ఇరువురి వాదనలు విన్న తర్వాత,  నేరస్థుని పై నేరం రుజువైనందున 3 సంవత్సరాల జైలు శిక్ష, 1500/-  రూపాయల జరిమానా విధించారు.నేరస్థునికి జైలు శిక్ష పడడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకట్ లింగం, తన వాదనలు వినిపించారు, కోర్టు కానిస్టేబుళ్లు శ్రీనివాస్, స్వామి, కోర్ట్ లైజనింగ్ హెడ్ కానిస్టేబుల్ రాజమల్లు, కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా పోలీసు కమిషనర్  పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టు సిబ్బందిని,కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీస్ అధికారులను అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *