ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే కఠిన చర్యలు 

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 11 : కడ్తాల్ పట్టణంలో ఎన్ హెచ్ 765 హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి కిరువైపులా  ఫుట్ పాత్ లను ఆక్రమించి చిరు వ్యాపారాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కడ్తాల్ సీఐ శివప్రసాద్ హెచ్చరించారు. సోమవారం కడ్తాల్ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులతో కలిసి రోడ్డుపై ఉన్న తోపుడు బండ్లు, పండ్లు, దుకాణ యజమానులు రోడ్డుపై పెట్టిన వస్తువులను తొలగించారు. అనంతరం షాపుల యజమానులకు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఫుట్ పాత్ లను ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది, కడ్తాల్ గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *