ఫిబ్రవరి 2నుంచి సమతా కుంభ్‌

  • పదిరోజులపాటు బ్రహ్మోత్సవాలు
  • పద్మభూషణ్‌ ‌రావడం ఆనందదాయకం
  • డియాతో చినజీయర్‌ ‌స్వామి

హైదరాబాద్‌,‌జనవరి30: తన మేధస్సుతో ఎన్నో సంస్కరణ తీసుకొచ్చిన ఘనుడు రామానుజా చార్యులు అని చిన్నజీయర్‌ ‌స్వామి అన్నారు. సోమవారం డియాతో మాట్లాడుతూ రామానుజచార్య మహామూర్తిని ఆవిష్కరిం చుకుని సంవత్సరం అవుతుందని చిన్నజీయర్‌ ‌స్వామి పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదిన సమతా మూర్తి మొదటి వార్షికోత్సవం మొదలు కాబోతుందని ఆయన తెలిపారు. ప్రతి ఏడాది సమతా కుంభ్‌ ‌పేరుతో బ్రహ్మోత్సవాలు జరుగుతాయని అన్నారు.హరిజనులు, దళితులకు సైతం ఆలయాల్లో సేవ చేసు అవకాశానికి కారణం రామానుజాచార్యులని చిన్నజియర్‌ అన్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల బ్రహ్మోత్సవాలు, ముచ్చింతల్‌ ‌లోని శ్రీ రామనగరంలో 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

పద్మభూషణ్‌ అవార్డు కోసం  పేరు సూచిస్తున్నారు కు ఏమైన అభ్యంతరమా అని అడిగాగా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలిపారు. పద్మభూషణ్‌ అవార్డు నేను కోరలేదు కానీ రావడం పట్ల సంతోషంగా ఉందని చిన్నజియర్‌ ‌స్వామి అన్నారు.ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక సిద్దాంతం ఉంటుందని.. దానికి అనుకూలంగానే పరిపాలన ఉంటుందని చినజీయర్‌ ‌స్వామి అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచినా ప్రజల రక్షణ కోసమే పరిపాలన సాగిస్తారని చెప్పారు.

ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికల తర్వాత రాజకీయాలు చేయడం ఆపేసి.. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తాయని.. కాని ప్రస్తుతం రాష్ట్రంలో అలాంటి వాతావరణం కనిపించడం లేదన్నారు. రాజకీయ పార్టీల నేతలు ప్రజల సమస్యలపై కాకుండా.. ఒకరిని ఒకరు దూషించుకోవడం పై ఎక్కువ ఫోకస్‌ ‌పెడుతున్నారని చినజీయర్‌ ‌చెప్పారు. కేవలం ప్రజా సంక్షేమం కోసమే అన్ని రాజకీయ పార్టీలు పనిచేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. సమతా స్ఫూర్తి కేంద్రానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సమతా కుంభ్‌ ‌పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని చిన్న జీయర్‌ ‌స్వామి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *