ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ఫార్మా రైతుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు
ఇబ్రహీంపట్నం ఎంఎల్ఎ మల్ రెడ్డి రంగారెడ్డి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,డిసెంబర్ 14 : ఫార్మాసిటీ తరలింపు నిర్ణయం హర్షించదగ్గ పరిణామమని,ఈఎన్నికలలో ఫార్మా రైతులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని,ఫార్మా రద్దు చేసి అక్కడ మంచి టౌన్ షిప్ ఏర్పాటు చేయబోతున్నామని వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని రాష్ట్రంలో ప్రజా పాలన ఏర్పడేందుకు ప్రజలు కృషి చేశారని ఇబ్రహీంపట్నం శాసన సభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే కృతనిచ్చయంతో కట్టుబడి పనిచేస్తున్నారన్నారు.ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల పథకాలను అమలు చేసేందుకు కృషి చేస్తోందని ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన పని చేస్తుందన్నారు.2017 అక్టోబరు లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముచ్చర్ల ఫార్మా సిటీ పేరుతో 20 వేల ఎకరాల భూమి సేకరణ కోసం పని చేసిందని ఆయన ఆరోపించారు.ప్రజాభిప్రాయ సేకరణలో  అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం 19 వేల 330 ఎకరాల భూమి కావాలని అడిగినప్పుడు ప్రజలు వ్యతిరేకం చెప్పారని,ప్రభుత్వం వేల మంది పోలీసులను పెట్టి ప్రజలను అడ్డుకున్నారనిఆయన మండిపడ్డారు.
ఫార్మాసిటీ పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎమ్మెల్యే బ్రోకర్ దందా చేసి ప్రజలను దోచుకున్నాడని,ఆయన తిన్నది అంత కక్కిస్తామన్నారు.పేదలకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను కూడా ప్రభుత్వం లాక్కుందని ఆయన దుయ్యబట్టారు.ప్రజలకు వ్యతిరేకంగా అప్పటి కెసిఆర్ ప్రభుత్వం పనిచేశాయని ఆయన ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కూడా ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పడం జరిగిందని మల్ రెడ్డి తెలిపారు.బుధవారం  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫార్మా సిటీ రద్దు చేసి అక్కడ నుంచి తరలిస్తామని చెప్పారని ఆయన పేర్కొన్నారు.ఫార్మా రైతులతో పాటు ఇబ్రహీంపట్నం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని,సంబరాలు సైతం చేసుకుంటున్నారని ఎమెల్యే ఆనందం వ్యక్తంచేశారు.ఇబ్రహీంపట్నం,మహేశ్వరం, కల్వకుర్తి నియోజక వర్గాల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి,ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *