- సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని వారికి ఆదేశాలు ఇవ్వాలి
- మహిళలపై దుశ్సాసన పర్వం ఆపాలన్న కాంగ్రెస్ ఎంఎల్‌ఏ సీతక్క
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10 : దండేపల్లి మండలంలోని కోయపోచగూడ ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ అధికారులు ప్రవర్తించిన తీరుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఫైరయ్యారు. దుశ్శాసన పర్వాన్ని గుర్తుచేశారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆమె అసెంబ్లీ దృష్టికి తీసుకుని వొచ్చారు. మహిళలపై వణ్యప్రాణి యాక్ట్ కింద కేసులు పెట్టి జైల్లో పెట్టి చిన్న పిల్లలకు వారి తల్లిదండ్రులను దూరం చేశారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంధనపల్లిలో చేపలు పట్టుకోవడానికి వెళ్తే కేసులు పెడుతున్నారని సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి వార్తలు రాసిన రిపోర్టర్లపైనా కేసులు పెట్టారని సీతక్క వాపోయారు. ఆదివాసీలను ఫారెస్ట్ ఆఫీసర్లు ఇబ్బంది పెడుతున్నారని, సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని ప్రభుత్వం వారికి ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యపై సానుభూతితో స్పందించి త్వరలో దీనిపై చట్టం తీసుకురావలని కోరారు.



