ఈవీఎంలపై నెపం నెట్టి రాహుల్, ప్రియాంకలు తప్పుకుంటారు
ఆరు నెలలకు ఒకసారి సెలవుపై థాయిలాండ్‌కు రాహుల్
10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ
యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా
ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, మే 27 : లోక్ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షడు మల్లిఖార్జున్ ఖర్గే తన ఉద్యోగాన్ని కోల్పోతారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా జోప్యం చెప్పారు. కాంగ్రెస్ పరాజయానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఏ మాత్రం బాధ్యత వహించరని అని చెప్పటం ద్వారా తమ గెలుపు ఖాయమని ఆయన చెప్పకనే చెప్పారు. పైపెచ్చు జూన్ 4న కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ ఓటమికి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కారణమని చెబుతారని అమిత్ షా ఎద్దేవా చేశారు. సోమవారం అమిత్ షా యూపీ ఎన్నికల ప్రచార ర్యాలీలలో మాట్లాడుతూ..ఐదు దశల లోక్‌సభ ఎన్నికల వివరాలు తన దగ్గర ఉన్నాయని, వాటి ప్రకారం మోదీ 310 స్థానాలను అధిగమించారని, జూన్ 4న రాహుల్ 40 దాటరని, అఖిలేష్‌కి నాలుగు సీట్లు కూడా రావని అన్నారు.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ వెనుకబడిన వారి ఇంట్లో పుట్టారని, రాహుల్, అఖిలేష్ ఇద్దరూ వెండి చెంచాతో పుట్టారని, వారికి తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలు తెలియవని అన్నారు. దేశంలోని వాతావరణం వారికి నచ్చలేదని, అందుకే రాహుల్ ప్రతి ఆరు నెలలకొసారి సెలవుపై థాయ్‌లాండ్‌కు వెళతారని, పూర్వాంచల్ వేడిని వారు తట్టుకోలేరని, మరోవైపు ప్రధాని మోదీ తన హయాంలో ఒక్క సెలవు కూడా తీసుకోలేదని షా దుయ్యబట్టారు.
ఇంకా వారిద్దరూ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ..ప్రధాని మోదీ ఎప్పుడూ అలాంటి ఆరోపణలను ఎదుర్కునలేదని తెలిపారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా మోడీపై 25 పైసల అవినీతి ఆరోపణలు కూడా లేవని, అయితే ఇద్దరు ‘‘షెహజాదే’’(రాహుల్-అఖిలేష్)





