ప్లాస్టిక్ రహిత సమాజం కోసం నడుం బిగించాలి : పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కె.పురుషోత్తం రెడ్డి

ముషీరాబాద్, ప్రజాతంత్ర, జూలై 20 : పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ కవర్, బ్యాగులను సంపూర్ణంగా నిషేధించారని, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి విద్యార్థులు యువకులు నడుం బిగించాలని ప్రముఖ పర్యావరణ వేత్త ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి అన్నారు. తెలంగాణ సిటిజన్ కౌన్సిల్(టిసిసి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ ముదిరాజ్ అధ్యక్షతన గురువారం గోలిపురాలోని జ్ఞాన భారతి మోడల్ హై స్కూల్లో జాతీయ ప్లాస్టిక్ ఫ్రీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన అవగాహన శిబిరం ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్లాస్టిక్ నిషేధం, అవగాహనకై గత 50 ఏళ్ళుగా జాతీయ స్థాయిలో కృషి చేస్తున్న ప్రొఫెసర్ కే.పురుషోత్తం రెడ్డి, గత 15 సం.లుగా ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్ధాలపై ప్రజలును చైతన్యవంతం చేస్తున్న తెలంగాణ గోశాల ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు మహేష్ అగర్వాల్ ను శాలువా మెమెంటో పూలమాలతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త వి.ప్రభాకర్ రావు, టిసిసి అధ్యక్షులు ఎస్.రామకృష్ణ శాస్త్రి, అన్న రావు కులకర్ణి, కె.శ్యామ్ రావు, స్కూల్ ప్రిన్సిపాల్ రమాదేవి, అధ్యాపకురాలు వి.లక్ష్మీ నాగ కుమారి తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *