ప్రైవేట్ గురువుల పరిస్థితి దినదిన గండం గా మారింది. యాజమాన్యాలు అందిన. కాడికి దోచుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను పిండుకుంటూ ప్రైవేట్ టీచర్లకు అన్యాయం చేస్తున్నారు. ఆర్థిక.శ్రమ దోపిడికి యధేచ్చగా పాల్పడుతున్నాయి. సకాలంలో జీతాలు చెల్లించకుండా ప్రైవేట్ విద్యా సంస్థలు శ్రమ దోపిడీకి పాల్పడుతుంది. పేరెంట్స్ జేబులు పిండి 12 నెలల ఫీజు వసూలు చేసి టీచర్లకు మాత్రం పది నెలల జీతాలను మాత్రమే ఇస్తున్నాయి. ఇది అన్యాయం. దోపిడీ కాదా?? తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేటు గురువులు దోపిడి అంతా ఇంతా కాదు .ప్రైవేట్ యాజమాన్యాలు తమ ఆస్తులను పెంచుకుంటూ ప్రైవేటు గురువులు మాత్రం దోపిడికి గురి చేస్తున్నారు. భద్రత లేని ఉద్యోగంతో దినదిన భయంగా గురువులు జీవితాన్ని వెల్లడిస్తున్నారు. వేతనాలు సరిగ్గా ఇవ్వకుండా అడ్డమైన శ్రమ దోపిడీకి ఆర్థిక దోపిడీకి పాల్పడుతూ యజమాన్యాలు గురువులను ఎంతో మానసిక వేదనకు గురి చేస్తున్నారు. ఈ విద్య సంవత్సరం ప్రారంభమై నెల గడిచిన ఇంకా జూన్ వేతనం ఇవ్వలేదు. గురువుల నెల 5వ తేదీన వేతనాలు బ్యాంకు అకౌంట్ ద్వారా చెల్లించండి. గురువులకు మీ ద్వారా రావలసిన న్యాయమైన హక్కులను వారికీ కల్పించండి ఆ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నించండి. పూటకో మాటలు చెప్పి పేరెంట్స్ దగ్గర ఫీజు వ•సూలు చేసినట్లు కాదు.
ఇప్పటికే బుక్స్ పేరుతో, అడ్మిషన్స్ పేరుతో పేరెంట్స్ ని ఆర్థికంగా బాగానే దోపిడీ చేశారు. కానీ ప్రైవేట్ గురువులకు వేతనాలు ఇవ్వడానికి యాజమాన్యానికి మనసు రాదు. ఈ విషయాలన్నీ ఇటు పేరెంట్స్ కావొచ్చు గురువులు కావొచ్చు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికే జిల్లాలో ఎన్నో కొత్త విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయ్ రాత్రికి రాత్రి క్యాంపస్ మార్చడం పర్మిషన్ లేకుండా విద్యాసంస్థలు నడపడం తక్కువ జీతం ఇచ్చి అన్ ట్రైనీడ్ వారిని తీసుకోవడం, అర్థంతరంగా గురువులను మధ్యలోనే తొలగించడం లాంటి ఎన్నో అక్రమాలు చేస్తున్నారు. యాజమాన్యాలు డబుల్ బెడ్ రూమ్ ఇప్పిస్తాం అని చెప్పే కల్లబొల్లి మాటలు గారడీ మాటలు మాట్లాడేముందు గురువులకు రావాల్సిన సమ్మర్ సాలరీ, పిల్లల దగ్గర 12 నెలలు పూర్తి ఫీజు వసూలు చేసి గురువులకు మాత్రం 10నెలల వేతనమే అన్యాయం కాదా??. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు కార్పొరేట్ విద్యా సంస్థలు వ్యాపారం గా మార్చి. ప్రైవేట్ ఉపాధ్యాయులను నిలువు దోపిడి. పాల్పడి తమ అక్రమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
సరైన గదులుగానీ.అర్హులైన ఉపాధ్యాయులు మౌలిక సదుపాయాలు కానీ లేకుండానే విద్యాశాఖ అధికారులకు లక్షల్లో లంచాలు పుచ్చు కొనే అక్రమంగా ప్రైవేట్ విద్యా సంస్థలు తమ పర్మిషన్లు పొందుతున్నాయి. సర్కారు విద్యాసంస్థలను జిల్లాల విద్యాశాఖ అధికారులే నిర్వీర్యం చేస్తూ అడ్డగోలుగా ప్రైవేట్ విద్యా సంస్థలకు అడిగిందే తడవుగా పర్మిషన్ ఇస్తున్నారు .తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీ ఈ అడ్డుకట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ప్రైవేటు ఉపాధ్యాయులకు ప్రతి నెల ఐదో తేదీలోగా వేతనాలు చూడాలి అలాగే ప్రతి సంవత్సరం ప్రైవేట్ విద్యా సంస్థల గురువులకు వేతనాలను కూడా పెంచాలి ప్రావిడెంట్ ఫండ్ కూడా పునరుద్ధరించాలి విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ సంస్థలపై తరచూదాడులు నిర్వహించాలి. ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా అమలు చేసేటట్టుగా చూడాలి.
-రావుల రాజేశం, లెక్చరర్
కరీంనగర్, 7780185674




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల