- వాట్సాప్ గ్రూప్ మేసేజీల్లో వేధింపులు
- ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా మారని వైనం
- ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కింద కేసు నమోదు
- వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడి
వరంగల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతిని మరో సీనియర్ విద్యార్థి సైఫ్ వేధించడం నిజమేనని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి చాలా సెన్సిటివ్ అని వెల్లడించారు. ప్రీతి ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయాడని, ఈ కారణంగానే ప్రీతికి సహకరించవద్దని తన స్నేహితులకు చెప్పాడని శుక్రవారం ఆయన వి•డియా సమావేశంలో వెల్లడించారు. ప్రీతిని సైఫ్ ఉద్దేశపూర్వకంగానే వేధించాడని రంగనాథ్ నిర్దారించారు. ప్రీతికి నేర్పించే క్రమంలో గట్టిగా చెబుతున్నానని సైఫ్ వాదిస్తున్నాడని, కానీ మొదట్నుంచీ సైఫ్ వల్ల ప్రీతి ఇబ్బంది పడుతూ వొచ్చిందని వివరించారు. వాట్సాప్ గ్రూపులో ప్రీతిని టార్గెట్ చేస్తూ సైఫ్ వేధించాడన్నారు. ఇద్దరి మధ్య రెండు, మూడు ఘటనలు జరిగాయని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రీతి గురించి అవమానకర పోస్టులు పెట్టాడన్నారు.
గ్రూపులో పోస్టు పెట్టి తనను అవమానపరచవద్దని సైఫ్‌ని ప్రీతి వేడుకుందన్నారు. తనను అవమానపరిచావని సైఫ్‌తో ప్రీతి చెప్పిందని, ఏదైనా ఉంటే హెచ్‌వోడీల దృష్టికి తీసుకురావాలని ప్రీతి కోరిందని వెల్లడించారు. సైఫ్ తన ఇతర మిత్రులతో కలిసి వాట్సాప్‌లో ప్రీతిని వేధించినట్టు తేలిందని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. 20వ తేదీన సైఫ్ వేధింపుల గురించి ప్రీతి తన తండ్రికి చెప్పిందని వెల్లడించారు. 21న ప్రీతి, సైఫ్‌తో కాలేజీ యాజమాన్యం విచారించిందని తెలిపారు. అయినా సైఫ్ తగ్గక పోవడంతో..మంగళవారం ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. సేకరించిన ఆధారాల ద్వారా సైఫ్‌ను అరెస్ట్ చేశామని..దీనిలో ఎలాంటి రాజకీయ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని వరంగల్ సీపీ రంగనాథ్ వెల్లడించారు. సైఫ్ గత నాలుగు నెలలుగా ప్రీతిని వేధించినట్లు ఆధారాలున్నాయని తెలిపారు.
వాట్సాప్ గ్రూప్‌లో మెసేజ్ పెట్టి ప్రీతిని అవమానిం చాడని చెప్పారు. గ్రూప్ లలో మెసేజ్ లు పెట్టి వేధించొద్దని ప్రీతి వేడుకున్నా సైఫ్ వినలేద న్నారు. బ్రెయిన్ లేదంటూ సైఫ్ హేళన చేస్తూ మాట్లాడుతున్నాడని ప్రీతి ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. హానికర ఇంజెక్షన్ల గురించి ప్రీతి గూగుల్‌లో వెతికిందని తెలిపారు. సైఫ్ వేధింపులు తట్టుకోలేకే ప్రీతి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించిందన్నారు. వాట్సాప్ గ్రూపులలో మెసేజ్‌లు పెట్టి వేధించడం కూడా ర్యాగింగ్ కిందకే వొస్తుందని సీపీ తెలిపారు. నిందితుడిపై ఎస్సీ,ఎస్టీ కేసులు పెట్టామని..కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రచారం చేయడం సరికాదన్నారు. సైఫ్‌కు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదన్న సీపీ..పోలీసులు రియాక్ట్ కాలేదన్నది అవాస్తమన్నారు.




