వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, జులై 28: భారీ వర్షాలతో ప్రాజెక్టులు పొంగిపొర్లుతుండడంతో ప్రమాదాలు జరగకుండా అధికారులు నిఘా ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనందు అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు. శుక్రవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల పరిధిలోని ఎబ్బనూర్ చెరువు, కోట్ పల్లి ప్రాజెక్టులను, వాగులను సందర్శించి, వర్షాలకు పాడైపోయిన పంటలను, వంగిపోయిన స్థంభాలను పరిశీలించారు. ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎక్కడ కూడా విద్యుత్ వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని విద్యుత్ శాఖ వారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ గుప్తా మాజీ మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




