నిజాలు నిప్పులే
వాటిని గుప్పెట్లో కాదు
కొన్నిసార్లు గొంతులో దాచాలి
కాలుతున్నా… కాల్చుతున్నా
అబద్దాలు తప్పులే
నాలుక చివరిలో వెలిగి
మనసు మొదల్లో అంటుకుని
జీవితమంతా ఆరిపోదు….ఆర్పలేము.
నిజం నడిబొడ్డులో నడిచే అబద్దాలకు
అబద్దం నుదుట గడచే నిజాలకు
మనసే మనిషికి ప్రశ్నగా
మనిషే జవాబు కాక తప్పదు.
– శ్రీ సాహితి




ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల