తాండూరు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 23 : తాండూరు పట్టణంలో శుక్రవారం నిర్వహించిన వినాయక నిమజ్జనం ప్రశాంతంగా కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లొల నరసింహులు పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పలు మండపాలో ప్రతిష్టించిన గణనాథుల ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలను అందుకున్న గణనాథులు శుక్రవారం గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. హిందూసవు ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిమజ్జన కార్యక్రమం శోభయాత్ర ప్రశాంతంగా కొనసాగింది. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు సహకరించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నిమజ్జనానికి వినాయకులను యాలాల మండలం కోకట్ కాగ్నానదికి తరలించేందుకు హిందూ ఉత్సవ సమితి తరుపున విశేష కృషి చేశారు. వినాయక నిమజ్జనం ప్రశాతంగా జరుపుకునేందుకు సహకరించడంపై శనివారం హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, అధ్యక్షురాలు, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ల తరుపున సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు వినాయక ఉత్సవ సమితి సభ్యులకు, పట్టణ ప్రజలకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.




