‌ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం కల్పించాలి

  • జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది
  • త్వరలో సమాచార శాఖలో 361 ఖాలీ పోస్టుల భర్తీ
  • మన రాష్ట్రంలోనే జర్నలిస్ట్‌లకు అత్యధికంగా అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల జారీ…
  • సమాచార శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 22 : ‌రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాచార శాఖ అధికారులు విస్తృత ప్రచారం కల్పించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గనుల శాఖ మంత్రి డాక్టర్‌ ‌పట్నం మహేందర్‌ ‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో సమాచార, పౌర సంబంధాల శాఖపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…సమాచార శాఖలో క్షేత్ర స్థాయిలో ఖాలీలుగా ఉన్న 361 వివిధ పోస్టులను త్వరలో భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటామని, ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టేందుకు అధికారులకు, సిబ్బందికి అవసరమైన కొత్త  కెమెరాలు, వాహనాలు మంజూరు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచార నిర్వహణలో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన దశాబ్ది ఉత్సావాలలో సమాచార శాఖ అధికారులు సమర్థవంతంగా సేవలు అందించారని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌ ‌రావు అధికారులను అభినందించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.

గత తొమ్మిదేళ్లలో ప్రభుత్వం సాధించిన ప్రగతిని ప్రజలకు  చేరవేయాల్సిన అవసరం ఉందని, సోషల్‌ ‌మీడియాలో సమాచార శాఖ పాత్రను పెంచాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో సాధిస్తున్న ప్రగతితో పాటు మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథ, రైతు సంక్షేమ పథకాలు, బతుకమ్మ సంబురాలు, వినాయక చవితి, శ్రీరామ నవమి, సమ్మక్క సారలమ్మ జాతర, రాష్ట్రంలోని చారిత్రక వారసత్వ అంశాలతో పాటు రంజాన్‌, ‌క్రిస్మస్‌ ‌పండుగ సందర్భంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సామాజిక చైతన్యం కోసం మరింత విస్తృతమైన ప్రచారం చేయాల్సిన అవసరముందని అధికారులకు మంత్రి సూచించారు. ఇక జర్నలిస్ట్‌ల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందని, దేశంలో జర్నలిస్ట్‌లకు  అత్యధికంగా 22,686 అక్రిడిటేషన్‌  ‌కార్డస్ ఇచ్చిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదేనని, కొరోనా విపత్కర సమయంలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలను ఆర్ధిక సహాయంతో ఆదుకున్నామని, అత్యవసర వైద్య సేవలు కూడా అందించామని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్లు రూపాయలు కార్పస్‌ ‌నిధిని కేటాయించారని, దీని ద్వారా జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్‌ ‌కూడా అందజేస్తున్నామని ఆయన అన్నారు. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌లను జర్నలిస్టులకు కేటాయించేందుకు ఇదివరకే సిఎం ఆదేశాలు జారీ చేశారని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో మీడియా భవన్‌ ‌నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయని, త్వరలోనే ముఖ్యమంత్రి భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. హెల్త్ ‌కార్డస్ ‌ద్వారా జర్నలిస్ట్‌ల ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో 479 జర్నలిస్టు కుటుంబాలకు 6 కోట్ల 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామని అధికారులు తెలిపారు. 136 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయంగా ఒక్కొక్కరికి 50 వేల చొప్పున 68 లక్షలు అందించడం జరిగిందని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు. జర్నలిస్టుల పిల్లల చదువుల కోసం నెలకు 1000 చొప్పున రూ. 74 లక్షల 37 వేలు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రభుత్వం 19 కోట్ల నిధులను కేటాయించిందని, అక్రిడిటేషన్‌ ఉన్న జర్నలిస్టులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఉచిత బస్సు పాస్‌ ‌కల్పించిన ఘనత మన రాష్ట్ర ప్రభుత్వానిదేనని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 7460 మంది జర్నలిస్టులు రెండు రోజుల శిక్షణ తరగతులను నిర్వహించి, వారిలో వృత్తి నైపుణ్యం పెంచామని ఆయన అన్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలలో జర్నలిస్టులకు ప్రెస్‌ ‌క్లబ్‌లను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మహేందర్‌ ‌రెడ్డి వెల్లడించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార శాఖ కమిషనర్‌  అశోక్‌ ‌రెడ్డి, డైరెక్టర్‌ ‌రాజమౌళి, అడిషనల్‌ ‌డైరెక్టర్‌ ‌నాగయ్య, జాయిట్‌ ‌డైరెక్టర్లు జగన్‌, ‌శ్రీనివాస్‌, ‌డిప్యూటీ డైరెక్టర్లు మధుసూధన్‌, ‌వై.వెంకటేశ్వర్లు, హష్మీ, ప్రసాదరావు, రాజారెడ్డి, కెవి సురేష్‌, ‌చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇం‌జనీర్‌ ‌రాధా కిషన్‌, ఆర్‌ఐఈ ‌జయరామ్‌ ‌మూర్తి, రాములు, జిల్లా పౌర సంబంధాల అధికారులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇన్ఫర్మేషన్‌ ఇం‌జనీర్లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *