ప్రభుత్వ భూముల్లోంచి నల్ల మట్టి తరలింపు నిలిపివేయాలనీ తహసిల్దార్ కు వినతి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్టు 7 : ఆమనగల్ మున్సిపాలిటీ లోని రెండో వార్డు ముర్తుజ పల్లి గ్రామ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 99 లో ప్రభుత్వ అసైన్డ్ భూముల్లోంచి నల్ల మట్టిని కొంతమంది అక్రమంగా తరలించుకుంటున్నారని వాటిని నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆమనగల్ తహసిల్దార్ సిహెచ్ లలిత కు ముర్తుజపల్లి గ్రామస్తులు వినతిపత్రం అందజేశారు. గ్రామానికి చెందిన కొంతమంది నాయకులు ప్రజాప్రతినిధులు నల్లమట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. వెంటనే నల్ల మట్టి తరలింపు ఆపాలని వారు డిమాండ్ చేశారు. నల్ల మట్టి తరలించుకుపోవడంతో చుట్టుపక్కల వ్యవసాయ పొలాల రైతులకు నష్టం వాటిల్లుతుందని ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతూ మధ్య దళారులు నల్ల మట్టిని లక్షలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *