ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలి

ఇబ్రహీంపట్నం,ప్రజాతంత్ర,నవంబర్ 6: ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించాలని సిఐటియూ మండల కన్వీనర్ పోచమోని కృష్ణ డిమాండ్ చేశారు.టిఫిన్ కు ప్రతి విద్యార్థి కి 25 రూపాయలు పెంచాలని డిమాండ్ చేస్తు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో సోమవారం ఏంఈఓకు మెమోరాండం ఇవ్వడం సమర్పించారు.ఈ సందర్భంగా మండల కన్వీనర్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ,బిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం అందించడానికి సరియైన బడ్జెట్ కేటాయించకుండా ప్రవేశపెట్టిందని విమర్శించారు.ఇది కార్మికులతో వెట్టి చేయించుకునే విధంగా ఉందని పేర్కొన్నారు.మంచాల మండలంలో ఈనెల 30 వ తేదీ నుంచి  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారం అందించాలని అధికారులు కార్మికులపై వత్తిడి తెస్తున్నారని అన్నారు.దాంట్లో భాగంగా విద్యార్థులకు ఇడ్లీ,పూరి,బొంబాయి రవ్వతో ఉప్మా,కిచిడి దానికి సంబంధించిన చట్నీలు తయారుచేసి విద్యార్థులకు వడ్డించాలని ప్రభుత్వం జీవోను జారీ చేసింది కానీ దానికి సంబంధించిన డబ్బులు ఇవ్వడంలో మాత్రం మధ్యాహ్న భోజన కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఉందని ఆయనవిమర్శించారు ఒక విద్యార్థికి 10 రూపాయల 50 పైసలు చెల్లించి పూరీలు,ఇడ్లీలు పెట్టాలని అది ఉదయం 8 గంటల లోపు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు.ఒక వ్యక్తి హోటల్లో గనుక టిఫిన్ చేస్తే 30 రూపాయల నుండి 40 రూపాయలు చెల్లిస్తున్నారని కానీ ఒక్కొక్క స్కూల్లో వంద మంది విద్యార్థులు ఉంటే ఒక్క విద్యార్థికి 10:50నిమిషాలకు టిఫిన్ ఏ విధంగా తయారవుతుందని అన్నారు.ప్రభుత్వం ఇచ్చే రూపాయలతో సన్న రవ్వ, దొడ్డు రవ్వ,కిచిడి,టమాటా,పులిహోరలు చేసిపెట్టడానికి సిద్దమని చెప్పారు.అలాగే అల్పాహారం తయారు చేయడానికి కావలసిన పత్రాలు,గ్రాండర్లు,వంట గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వమే అందించాలని కోరారు.అల్పాహారం తయారు చేసి పెట్టే కార్మికులకు నెలకి 1500 లు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా నాయకులు చింతకింది సరిత,జి అలివేలు,స్వాతి, రంగమ్మ,జంగమ్మ,లక్ష్మి,అనిత,కలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *