పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 4: పటాన్ చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం వాణిజ్య శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు అంశంపై సదస్సు నిర్వహించారు.నేటి ముఖ్య వక్త ఐఏసిఈ అకాడమీ నాగేశ్వర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ… వివిధ శాఖల నోటిఫికేషన్ ఖాళీలు గురించి వివరించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ విద్యార్థులు శ్రమించే అలవాటు పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ భద్రత నిబద్ధత గల జీవితాన్ని ఎంచుకోవాలనే అనుకునేవారు ప్రభుత్వ ఉద్యోగం పట్ల ఆసక్తి ఉంటుందని తెలియజేశారు. పోటీ పరీక్షల పట్ల ఆసక్తిని పెంచుకుని వీలైనన్ని ఎక్కువ పరీక్షలకు హాజరు కావాలని వైస్ ప్రిన్సిపల్ అల్లం రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగం ద్వారా ప్రజా సేవ సాధ్యపడుతుందని డాక్టర్ రాజిరెడ్డి హెచ్ ఓడి వాణిజ్య విభాగ శాఖ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో హరిత, చంద్రశేఖర్, స్వాతి, ఉపన్యాసకులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.




