ప్రభుత్వాన్ని పడగొడతారా…టచ్‌ చేసి చూడండి

భువనగిరికి 200 కోట్లు ఇవ్వలేని అసమర్థుడు
గడ్కరీని కలిసి ఆర్‌ఆర్‌ఆర్‌కు నిధులు అడిగాం..రాష్ట్రం కోసం ప్రధానిని కూడా కలుస్తాం
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి ఫైర్‌
కేసుల నుంచి తప్పించుకోవడానికి బిజెపితో లోపాయకారి ఒప్పందానికే దిల్లీకి కెసిఆర్‌ అని ఆరోపణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 21 : ప్రభుత్వాన్ని పడగొడ్తమన్నట్టుగా కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతున్నారని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. టచ్‌ చేసి చూడు..నామరూపాల్లేకుండా చేస్తామని ఆయన కౌంటర్‌ ఇచ్చారు. బుధవారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. భువనగిరి ఖిల్లా విూద రోప్‌ వేసుకుందామని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని రూ. 200 కోట్లు అడిగితే కనీసం స్పందించలేదన్నారు. నాలుగేండ్ల నుంచి ఫైల్‌ దగ్గర పెట్టుకొని సొంత రాష్ట్రానికి కనీసం రూ. 200 కోట్లు తేలేని మంత్రి కిషన్‌ రెడ్డి అని ఎద్దేవా చేశారు. కేబినెట్‌లో ఉంటూ కనీసం రూ. 200 కోట్ల నిధులు ఇవ్వలేకపోయారని, తాము వెళ్లి కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కలిసి రూ. 3 వేల కోట్ల పనులు తెచ్చుకున్నామన్నారు.

అభివృద్ధి పనుల కోసం అవసరమైతే ప్రధాన మంత్రిని కూడా కలుస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి రాలేదని అన్నారు. రెండు మూడు రోజుల్లో మరో రెండు హావిూలను అమలు చేయబోతున్నామని చెప్పారు. ఎన్నికలకు ముందు మోదీ మాట్లాడిన స్పీచ్‌ ఆడియోలు తన వద్ద ఉన్నాయని, 20 కోట్ల ఉద్యోగాలిస్తానన్న ప్రధాని ఇచ్చారా..అని ప్రశ్నించారు. బ్లాక్‌ మనీ తెస్తానన్న ప్రధాని తెచ్చారా..ఓ వైపు దిల్లీలో రైతులు ధర్నా చేస్తుంటే పట్టించుకోవడం లేదన్నారు. రూ. 500 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1200 చేరిందని అన్నారు. నమామి గంగాకు కేంద్రం రూ. 4 వేల కోట్లు ఖర్చు చేసిందని, హైదరాబాద్‌ లోని మూసీకి నిధులెందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసుల నుంచి తప్పించుకునేందుకే బీఆర్‌ఎస్‌, బీజేపీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందని విమర్శించారు. అందులో భాగంగానే కేసీఆర్‌ దిల్లీ వెళుతున్నారని అన్నారు. శత్రువైన మోదీ దగ్గరికి కేసీఆర్‌ వెళ్లిన కేటీఆర్‌ను ఆశీర్వదించండి అని అడిగారంటే ఇద్దరి మధ్య దోస్తానా కుదిరినట్టేనన్నారు. తమ దిల్లీ పర్యటన విజయవంతం అయిందని… తెలంగాణ రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)కు నిధులు కేటాయిస్తానని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ హావిూ ఇచ్చినట్లు రోడ్ల భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్‌ పూర్తి అయితే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ 50 శాతం కవర్‌ అవుతుందని.. హైదరాబాద్‌ రూపురేఖలు మారిపోతాయిని అన్నారు.

రైల్వే ప్రాజెక్టుకు కూడా హావిూ ఇచ్చారని.. ఇక పనులు మొదలవుతాయని తెలిపారు. నల్గొండ రింగ్‌ రోడ్డుకు రూ.700కోట్లు ఇస్తామని అన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నాయకులు మోడీని ఇక్కడ తిడతారు అక్కడ కాళ్లు పట్టుకుంటారని ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి భువనగిరి అభివృద్ధికి నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని.. కిషన్‌ రెడ్డి తెలంగాణకు నిధులు తేలేని అసమర్థుడని వ్యాఖ్యలు చేశారు. కిషన్‌ రెడ్డి తమ ప్రభుత్వాన్ని కూలగొడతాం అంటున్నారని.. కాంగ్రెస్‌ను టచ్‌ చేస్తే అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. వచ్చే ఐదేళ్లలో తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ  అపాయింట్‌ మెంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అడిగారని.. త్వరలో మోడీని కలుస్తామని చెప్పారు. సీఆర్‌ఎఫ్‌ కింద ప్రపోజల్‌ పంపామని.. రూ.800 కోట్లు విడుదల అవుతున్నాయని తెలిపారు. అవసరం లేకున్నా పంజాబ్‌, హర్యానాలో డబ్బులు ఖర్చు పెట్టి దుబారా చేశారని మండిపడ్డారు. కేఆర్‌ఎంబీ అంటే ఏంటిదో బీఆర్‌ఎస్‌ వాళ్లకు తెలియదన్నారు. కేఆర్‌ఎంబీకి రూ.200 కోట్లు, జీఆర్‌ఎంబీకి రూ.200కోట్లు మెయింటెనెన్స్‌కు ఇస్తామని చెప్పారన్నారు. నీళ్ల విషయంలో నల్లగొండను మోసం చేసినందుకు 11 చోట్ల ప్రజలు ఓడగొట్టారన్నారు. పార్లమెంట్‌లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటు గెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *