వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, ఆగస్టు 9: ప్రభుత్వం ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవియన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఏబీఎన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు సరైన విధంగా అవకాశాలు కల్పిస్తూ వారి అభివృద్ధికి బాటలు వేస్తామని అధికారంలోకి వచ్చి ఉపాధ్యాయులను పట్టించుకోకుండా విద్యారంగ సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే పి అర్ సి కమిటీని వేసి మద్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న అన్ని డిఏలను వెంటనే ప్రకటించాలి అని కోరారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు సొంత జిల్లాలకు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ ఇతర అంశాలపై ఉన్న కేసులను కోర్టు ద్వారా పరిష్కరించి అన్ని కేటగిరీలలో పదోన్నతులు బదిలీలను చేపట్టాలన్నారు. పర్వత గల స్కూల్ అసిస్టెంట్లకు జూనియర్ లెక్చరర్స్ డైట్ లెక్చరర్స్ ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. పండిత్ పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్ అమలుపరచాలన్నారు. ప్రతి పాఠశాలకు స్కావెంజర్లను పునరుద్ధరిస్తూ నైట్ వాచ్మెన్లను నియమించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి టిపియూఎస్ ఉపాధ్యాయ సంఘం నాయకులు సభ్యులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



