ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్య లను  వెంటనే పరిష్కరించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వికారాబాద్ జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు హారతి ద్వారకనాథ్ పేర్కొన్నారు. శనివారం వికారాబాద్ శ్రీ సత్యసాయి జ్ఞానంకేంద్రం గంగవరం లో జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము అధ్యక్ష,కార్యదర్శుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అధ్యక్షులు హారతి ద్వారకానాథ్
మాట్లాడుతూ ప్రభుత్వము వెంటనే విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.జిల్లా కేంద్రం లో ఇంతవరకు విశ్రాంత ఉద్యోగులకు ఒక స్వంత భవనంలేక
ఇబ్బందులకు గురివుతున్నారని
త్వరలో అసెంబ్లీ స్పీకర్, జిల్లాలోని
ఏమ్మెల్లేకు వారి అనుమతితొ
సన్మానసభ ఏర్పాటు చేసి ఒక
ప్రభుత్వ ప్లాటును అడిగితప్పక పొందగలమని ధీమా వ్యక్తం చేశారు.
బస్వ రాజ్ సహధ్యక్షులు   మాట్లాడుతూ 1వ తేది    ప్రభుత్వ ము పింఛనుమంజూరు చేయాలనీ,3డీ. ఆర్ లు  వానిబకాయలు ఇవ్వాలని కోరిరి.
మండల అధ్యక్షులు మాణికప్రభూ
మాట్లాడుతూ  ఈ కుబేర్ లో బెట్టిన
అన్ని వేతనాలు వెంటనె చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో డా. భక్తవాత్సలం, సీనియర్ అడ్వకెట్ గోపాలరెడ్డి,జిల్లా
కార్య దర్శి నర్సింహారెడ్డి
మండల సహాధ్యక్షులు బందప్ప గౌడ్, విటోబా, మండలాల నుండి విచ్చేసి న అధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *