ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 2: ప్రపంచానికి ఆదర్శప్రాయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పటాన్ చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం, గాంధీ పార్క్, ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో గల గాంధీ మహాత్ముడి విగ్రహాలకు ఎమ్మెల్యే జిఎంఆర్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస పద్ధతుల ద్వారా దేశానికి స్వతంత్రం తీసుకు వచ్చిన మహోన్నత నాయకుడు మాత్మ గాంధీ అని కొనియాడారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని అన్నారు. నేటి తరాలకు మహాత్మా గాంధీ చరితను తెలియజేసే విధంగా ప్రతి గ్రామపంచాయతీ ఆవరణలో విగ్రహాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రధాన కూడళ్లలో సైతం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, ఎంపిడిఓ బాన్సిలాల్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కొమరగూడెం వెంకటేష్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *