అహ్మదాబాద్, డిసెంబర్ 28 : ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అనారోగ్యానికి గురయ్యారు. ఆమెను హుటాహుటిన అహ్మదాబాద్‌లోని యూఎన్ మెహతా హాస్పిటల్‌కి తరలించారు. ప్రస్తుతం హీరాబెన్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి ఆరోగ్య వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుజరాత్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరవ్యాప్తంగా ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేశారు. హీరాబెన్ వయస్సు ప్రస్తుతం 100 ఏండ్లు. ప్రస్తుతం ఆమె గాంధీనగర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తమ్ముడు పంకజ్ భాయ్‌తో కలిసి బృందావన్ బంగ్లాస్-2, రైసన్, గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం హీరాబెన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు హెల్త్ బుటిలెన్ రిలీజ్ చేశారు.
హీరాబెన్ మోడీ ఈ ఏడాది జూన్ లో 99వ సంవత్సరంలో అడుగుపెట్టారు. గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యేలు దర్శనాబెన్ వాఘోలా, కౌశిక్ జైన్ లు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాని నరేంద్రమోడీ ఇటీవలే తల్లి హీరా బెన్ ను కలిశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్ వెళ్లిన ఆయన తల్లిని కలిశారు. ఆమెతో కలిసి టీ తాగిన ఫొటోలు సోషల్ డియాలో వైరల్‌గా మారాయి. ఇటీవలే మోడీ సోదరుడు, కుటుంబ సభ్యులు కర్నాటక మైసూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారు.



