‌ప్రధాని మోదీ అబద్ధాల ప్రచారకర్త

  • స్థాయి దిగజారి  వ్యాఖ్యలు
  • కెసిఆర్‌ ఒక ఫైటర్‌, ఆయన మోదీలాంటి చీటర్‌ ‌తో కలిసి పని చేయరు
  • మేము దిల్లీ బానిసలం గుజరాత్‌ ‌బానిసలం కాదు
  • ప్రధానమంత్రి అసత్యాల పైన బిఆర్‌ఎస్‌  ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌  ‌కేటీఆర్‌ ఆ‌గ్రహం
హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,  అక్టోబర్‌ 03 : ‌ప్రధానమంత్రి జూమ్లాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తి .. ఓ అబద్ధాల ప్రచారకర్త అని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తం చేశారు. ఇంటింటికి నీళ్ళు ఇస్తాం, ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తాం, 15 లక్షల రూపాయలు ఇస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను ఐదు ట్రిలియన్‌ ‌డాలర్లకు చేర్చుతానని  ఆయన చెప్పినవన్నీ అబద్ధాలేనని  ఆయన దుయ్యబట్టారు.  ప్రధానమంత్రి స్థాయిని తగ్గించేలా నరేంద్ర మోదీ మాట్లాడడం విచారకమన్నారు. రాజకీయాల కోసం ఇంత నీచానికి  దిగజారిన వ్యక్తి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదని..  ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మధ్య జరిగిన ఒక అధికారిక సమావేశాలను నీచమైన రాజకీయాలకు మోదీ వాడుతున్నారని కేటీఆర్‌ ‌విమర్శించారు.  ప్రధానమంత్రి అబద్ధాల తర్వాత ప్రతి అధికారిక సమావేశానికి ఒక కెమెరాని పట్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తున్నదని..  తనకు అలవాటైన అబద్దాలకు అనుగుణంగా మోమోదీ  రాజకీయాలు చేస్తున్నారు.
విద్య అర్హతల విషయంలోనే అబద్దం చెప్పిన ప్రధానమంత్రి మాటలను ఎవరు నమ్ముతారు? అని ఆయన ప్రశ్నించారు.  ప్రధానమంత్రి లాంటి వ్యక్తి ఇన్ని అబద్ధాలు ఆడడం దురదృష్టకరం..ఇంతకంటే బాధాకరం శోచనీయం ఇంకోటి లేదన్నారు. ఏ రాష్ట్రం వెళ్తే ఆ రాష్ట్రం వెళ్లి అబద్దాలు ఆడడం మోదీకీ కి అలవాటు అయిందని.. బెంగాల్‌ ‌వెళ్తే మమతా బెనర్జీ పైన, ఒరిస్సా వెళ్తే నవీన్‌ ‌పట్నాయక్‌ ‌పైన, మేఘాలయ వెళ్తే సంగ్మా పైన అబద్దాలు చెప్పడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. ఆ తర్వాత వారితోనే పొత్తులు పెట్టుకుంటారని.. ఈ ప్రధానమంత్రి కాంగ్రెస్‌ ‌పార్టీ టిఆర్‌ఎస్‌ ‌కి కర్ణాటక నుంచి డబ్బులు ఇచ్చిందని చెప్తున్నారు.. ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకోటి లేదన్నారు.  ప్రధానమంత్రి తో ఉంటే మంచివాళ్లు… ప్రకాశ్‌ ‌బాదల్‌- ‌సుబ్బి సింగ్‌ ‌బాదల్‌ ‌వంటి వాళ్ళతో పొత్తులు పెట్టుకోలేదా.. కాశ్మీర్లలో ముఫ్తీ మహమ్మద్‌ ‌సహిద్‌ ‌కుమార్తే తో పొత్తు పెట్టుకోవచ్చు. చంద్రబాబు నాయుడు లోకేష్‌ ‌గారితో కలిసి పని చేయవచ్చుఎన్డీఏలో ఉండవచ్చు. బాల్‌ ‌ఠాక్రే కొడుకు ఉద్ధవ థాక్రే తో కలిసి బిజెపి పొత్తు పెట్టుకోవచ్చు.. అప్పుడు రాజులు యువరాజులు గుర్తుకురారు అని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు.
జనతాదళ్‌ ‌సెక్యూలర్‌ ‌దేవేగౌడ, వారి కుమారుడు కుమారస్వామితో పొత్తు పెట్టుకోవచ్చు.. మీతో ఉంటే వారసత్వ రాజకీయాలు గుర్తుకు రావు లేదంటే గుర్తుకు వస్తాయి.. ప్రధానమంత్రి పచ్చి అబద్దాలకోరు అని తెలిసిన ప్రతీ ఒక్కరూ సిగ్గుతో తలదించుకుంటారని ఆయన అన్నారు.  బిజెపి ఓ జూటా  ఫ్యాక్టరీ ఆఫ్‌ ఇం‌డియా,  ఓ జూటా పార్టీ ఆఫ్‌ ఇం‌డియా.. బిజెపి ఒక వాట్సాప్‌ ‌యూనివర్సిటీ.. ప్రధానమంత్రి కథలు చెప్పడంలో ఆరితేరినారు, ఆయన సినిమా కథలు రాయడంలో ప్రయత్నించాలి..  పార్టీలని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న ఎన్డీయే లో చేరాల్సిన అవసరం ఎవరికీ లేదు… ఎన్‌ ‌డి ఏ ఒక మునిగిపోతున్న నావా.. ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు అంటూ పేర్కొన్నారు.  రాహుల్‌ ‌గాంధీ వచ్చి బీఆర్‌ ఎస్‌  ‌బిజెపికి బీ టీం అంటాడు… కాంగ్రెస్‌ ‌పార్టీతో కలిసి పని చేస్తున్నమని ప్రధానమంత్రి అంటాడు.. కాంగ్రెస్‌ ‌నుంచి టిఆర్‌ఎస్‌ ‌కు  డబ్బులు వస్తుంటే కేంద్ర ఐటి శాఖ కానీ ఇతర శాఖలు కానీ నిద్రపోతున్నాయా? అని ఆయన ప్రశ్నిచారు.
కాంగ్రెస్‌ ‌పార్టీలో ఉన్నప్పుడు ఉన్న హేమంత్‌ ‌బిశ్వశర్మ పైన ఉన్న కేసు మీ పార్టీలో చేరినాక ఏమైంది..  నారాయణ రనే, జ్యోతి రదిత్యా సిందియ వంటి వాళ్ళ పైన ఉన్న కేసులు మీ పార్టీలో చేరినాక ఏమైనాయి..  కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడుతున్న ప్రధానమంత్రి, మంత్రులు జ్యోతిరాదిత్య సింథియా  ఎవరు, జైశా ఎవరో,  అనురాగ్‌ ‌ఠాకూర్‌ ఎవరో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.  కెసిఆర్‌ ఒక ఫైటర్‌, ఆయన నరేంద్ర మోదీలాంటి చీటర్‌ ‌తో కలిసి పని చేయరు.. మేము ఢిల్లీ బానిసలం గుజరాత్‌ ‌బానిసలం కాదు..  రెండుసార్లు మేము ప్రజాస్వామికంగా ప్రజలల్లో గెలిచిన వ్యక్తులం..  గుండెలు చించుకొని అరిసినంత మాత్రాన అబద్ధాలు నిజం అయిపోవు..  మా పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయించేది ప్రధానమంత్రి కాదు…
మా పార్టీ ఎమ్మెల్యేలు అనే విషయం ప్రధానమంత్రి కి తెలియదు..  తెలంగాణ ప్రజలు మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ‌ని ఎన్నుకోవడానినికి రెడీ ఉన్నారు.. ఎన్ని అబద్ధాలు చెప్పినా బిజెపిని తెలంగాణ ప్రజలు పట్టించుకోరు..  గత ఎన్నికల్లో 105 స్థానాల్లో బిజెపి డిపాజిట్‌ ‌గల్లంతయింది.. ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసిన ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడిన… తెలంగాణ ప్రజలకు 9 సంవత్సరాలలో బిజెపి ఏమి చేయలేదని అందరికీ తెలుసు..  తెలంగాణ రాష్ట్రానికి చేసింది గుండు సున్న.. మీకు వచ్చేస్థానాలు కూడా గుండు సున్నా..  చివరిదాకా నిలబడతాం బిజెపితో కొట్లాడుతాం..  ప్రజాక్షేత్రంలో గెలిచి తీరుతాం అని కేటీఆర్‌ ‌గట్టిగా వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *