‌ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన ఖరారు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబర్‌ 3 : ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 7, 11 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. 7న బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో  ‘బీసీల ఆత్మగౌరవ సదస్సు’ జరగనుంది. 11న సికింద్రాబా ద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌లో మాదిగ ఉప కులాల ‘విశ్వరూప మహాసభ’ జరగనుంది. ఈ రెండు సభలకు చీఫ్‌ ‌గెస్టుగా మోదీ రానున్నారు.

రోజుల వ్యవధిలో ప్రధాని 2 సార్లు హైదరాబాద్‌కు రానుండడంతో ఆయన సభ ఏర్పాట్లపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. దాదాపు నెల రోజుల తర్వాత ప్రధాని మళ్లీ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు రాష్టానికి వొస్తున్నారు. మోదీ తెలంగాణ టూర్‌ ‌షెడ్యూల్‌ను ఖరారు చేసే పనిలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *