హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 08 : 32 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బీస్టేడియంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం హర్షణీయం అని వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం అధ్యక్షులు వెన్న ఈశ్వరప్ప బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రధానితో తెలంగాణ రాష్ట్రంలోని 32 కులాల ప్రతినిధులతో పాటు తాను కూడా పాల్గొన్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ ప్రతి ఒక్క కులం ప్రతినిధుల దగ్గరికి వచ్చి వారు చెప్పిన విషయాలను కూలంకశంగా విన్న తర్వాత అందరితో మాట్లాడినట్టు తెలిపారు. ఈ సందర్బంగా వెన్న ఈశ్వరప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వీరశైవ లింగాయత్ లింగ బలిజలతో పాటు మిగతా 32 కులాలను కేంద్ర ఓబీసీ జాబితాలో చేర్చాలని విన్నవించినట్లు తెలిపారు. ఇందుకు మోడీ వెంటనే స్పందించి, అతిత్వరలో కేంద్ర క్యాబినెట్లో ఆమోదించి కేంద్ర ఓబీసీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రధానితో ఓబీసీ కులాల సమావేశంలో పాల్గొన్న వెన్న ఈశ్వరప్ప




