కుల్కచర్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 30: ప్రతీ ఒక్కరు దైవచింతన కలిగి వుండాలని కుల్కచర్ల మండల ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి కలకొండ చంద్రశేఖర్ అన్నారు.మండల కేంద్రంలో నిర్మిస్తున్న శివాలయ అభివృద్ధికి కృషి చేస్తామని సోమవారం మండల కేంద్రంలో వీరు శైవ ఆలయ నిర్వహకులకు 11 వేల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరిలో దైవచింతన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం ఆలయ నిర్వహకులు రవిచందర్, చందు, వినోద్, ఈశ్వరయ్య, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు దైవచింతన కలిగి వుండాలి




