ఉప్పల్, ప్రజాతంత్ర, నవంబర్ 27: కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రజకులకు భరోసా లభించిందని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం పాదయాత్రలో భాగంగాఉప్పల్ లోని పాతబస్తీ భరత్ నగర్ రజక సంఘంతో బండారి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నాయకులతో కలిసి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కులవృత్తుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో రజకులకు భరోసా లభించిందని, దోభీఘాట్లకు అందిస్తున్న 250 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ద్వారా ఇప్పటికే లక్షలమంది రజకవృత్తిదారులు లబ్ధి పొందతున్నారన్నారు. ఒక్క అవకాశం ఇచ్చి ఉప్పల్ ప్రజలకు సేవ చేవ చేసే భాగ్యం కల్పించండి అని అన్నారు. ఈనెల 30వ తారీకు జరిగే ఎన్నికలలో ఈవీఎం మిషన్లో మూడో నెంబర్ పై నొక్కి కారు గుర్తుకు వోటు వేసి నన్ను గెలిపించాలని కోరారు.పిలిస్తే పలికే నాయకుడిగా అందుబాటులో ఉండి ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా రజక సంఘం నేతలు మాట్లాడుతూ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అరటికాయల భాస్కర్, రజక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎర్ర కృష్ణ, జూపల్లి శ్రీనివాస్, అంతిగారి జంగయ్య, ముదిగొండ రవీందర్, ముదిగొండ బాలకృష్ణ, అంతిగారి రవి, ముదిగొండ శ్రీకాంత్, అంతిగారి పాండు, జూపల్లి బంటి, ఎర్ర అశోక్ లు పాల్గొన్నారు.
ప్రతి క్షణం ప్రజా శ్రేయస్సు కోసమే తపిస్తూ ఉండే వ్యక్తి బండారి లక్ష్మారెడ్డి




