ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 26 : ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతను అలవర్చుకోవాలని మానవుడికి దైవభక్తి కలిగి ఉంటే సన్మార్గంలో నడిచి సమాజంలో పదిమందికి మేలు చేస్తారని ఆమనగల్లు సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా అన్నారు. వినాయక చవితి నిమజ్జనం లో భాగంగా శ్రీ గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్టు ద్వారా నిమజ్జన, అన్నదాన కార్యక్రమాల నిమిత్తం బ్రహ్మంగారి కాలనీ గణేష్ ఉత్సవ కమిటీ కి రూ.15 వేలు..  స్కైబ్లు యూత్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు రూ.15 వేలు చందా రూపంలో అందజేసినట్లు తెలిపారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  పిఎసిఎస్ డైరెక్టర్లు వెంకటయ్య, రమేష్, ముద్విన్ ఉపసర్పంచ్  వినోద్, చ రికొండ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జంగయ్య, గోపాల్, సాబెర్, నరసింహ, సిద్దిగారి సురేష్, యూత్ సభ్యులు కందికంటి శేఖర్, నవీన్, రాఘవేందర్, విఘ్నేష్, సాయికుమార్, శ్రీహరి, శివ ప్రసాద్, రాఖీ, వినయ్, శివ, శివకుమార్, చింటు, పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *