ప్రతి ఒక్కరు కళ్ళను దానం చేయాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 7 :  జిల్లా ఆంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణ ఆదేశాల మేరకు  లయన్స్ క్లబ్ ఆఫ్ అమనగల్లు ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు యాచారం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేత్రదానము పై ప్రజలలో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరు తమ కళ్ళను దానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. సీజనల్ లో కండ్లకు వచ్చే కళ్ళకలకతో జాగ్రత్త ఉండాలని ఆయన సూచించారు. క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టి సేవా కార్యక్రమం ప్రజల సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో కంటి వైద్యలు ఏం.చంద్రశేఖర్ 76 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 25 మందికి ఆపరేషన్ నిమిత్తం రామ్రెడ్డి ఐ  హాస్పిటల్ కి తరలించినట్లు క్లబ్ పిఆర్వో పాషా తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *