‌ప్రతిపక్షాల సమావేశం రోజే దిల్లీ రాకలో ఆంతర్యం?

బిజెపితో చర్చలకే కెటిఆర్‌ ‌దిల్లీకి…
తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే విమర్శ

న్యూ దిల్లీ, జూన్‌ 23 : ‌కేంద్ర మంత్రులను మంత్రి కేటీఆర్‌ ‌కలవడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్ ‌మాణిక్‌రావ్‌ ‌థాక్రే స్పందిస్తూ..ఓ వైపు శుక్రవారం  పాట్నాలో విపక్షాల వి•టింగ్‌ ‌జరుగుతుండగా…మరోవైపు దిల్లీలో బీజేపీతో  బీఆర్‌ఎస్‌ ‌నేతలు మంతనాలు జరుపుతున్నారన్నారని విమర్శించారు. ప్రతిపక్షాల సమావేశం రోజే బీజేపీ మంత్రులను మంత్రి కేటీఆర్‌ ‌కలవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.

కేంద్రమంత్రి అమిత్‌ ‌షా సహా మరికొందరిని బీఆర్‌ఎస్‌ ‌నేత కేటీఆర్‌ ‌కలుస్తున్నారన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్‌ ‌కూటమిగా కట్టేందుకు దిల్లీలో చర్చలు జరుపుతున్నారని అన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ ‌కలిసే ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తుందని.. ఎవరు దాన్ని అడ్డుకోలేరని థాక్రే ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉందని..ఇప్పుడు ప్రజలు కాంగ్రెస్‌ ‌వైపు ఉన్నారని మాణిక్‌రావ్‌ ‌థాక్రే పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *