ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్ద పీట

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 10:  ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట పోయినట్లు  ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. దోమలపై యుద్ధంలో భాగంగా ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్ల మాజీ కార్పొరేటర్లు,  పలు డివిజన్ల అధ్యక్షులచే ఎమ్మెల్యే  కార్యాలయంలో తమ స్వంత నిధులతో వారి, వారి డివిజన్ల అవసరాల కోసం ఫాగింగ్ మిషిన్లు కొనుగోలు చేశారు. దానిలో భాగంగా  ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ప్రతి డివిజన్ల వారికి ఒక్కొక్కటి ఫాగింగ్ మిషన్ మంజూరు చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా పాగింగ్  మిషన్లను అందజేశారు.  ఈ సందర్బంగా సుదీర్ రెడ్డి  మాట్లాడుతూ.. దోమలపై యుద్ధం  జరగాలంటే దోమలను తరిమికొట్టాలన్నారు. అందుకే దోమలపై దండయాత్ర చేపట్టామని ప్రజలు చైతన్య వంతులై సహకరించాలని సుదీర్ రెడ్డి  పిలుపునిచ్చారు. దోమల కారణంగా ప్రాణసంకటమైన జ్వరాలు వస్తాయని..వైద్యం కోసం లక్షల రూపాయల్లో ఖర్చవు తుందన్నారు. దోమలను నివారించగలిగితే ఇంటిల్లిపాది ఆనందంగా ఉంటారన్నారు. అందుకే దోమలను నివారించేం దుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు.  ప్రతి ఒక్కరు తమ, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవలని కోరారు. ప్రస్తుతం జ్వరం,దగ్గు,జలుబు ఇతర లక్షణాలతో బాధపడటం జరుగుతుందని..రాబోయే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు డెంగ్యూ,మలేరియా ఇతర లక్షణాలు కూడా జ్వరం,దగ్గు,జలుబు లాగే వస్తాయన్నారు. అయితే అప్పుడు ప్రజలు ఏ లక్షణాలతో ఇబ్బందులు పడుతున్నారో అని తెలుసుకోవడం కష్టమన్నారు.  ముందుజాగ్రత్త చర్యగా దోమల నివారణకు అన్ని డివిజన్ల వారికి ఫాగింగ్ మెషిన్లు సమకూర్చడం జరిగిందని తెలిపారు. ఎల్.బి.నగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలు కూడా తమ సామాజిక బాధ్యతగా ఇంటి పరిసరాల్లో దోమలు నిల్వ లేకుండా చూసుకోవాలని కోరారు. ముఖ్యంగా పులా కుండీల్లో,పాత టైర్లు,ఇతర వస్తువుల్లో నీరు నిలువవుండకుండా చూసుకోవాలని కోరారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆచరిస్తే దోమలపై యుద్ధం సాధించి నట్టు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం,దయనంద్ గుప్తా,సీనియర్ నాయకులు గజ్జల మధుసూధనరెడ్డి,మాజీ కార్పొరేటర్లు ముద్రబోయిన శ్రీనివాసరావు,సాగర్ రెడ్డి,జిన్నారం విఠల్ రెడ్డి,జిట్టా రాజశేఖర్ రెడ్డి,చెరుకు ప్రశాంత్ గౌడ్,  డివిజన్ల అధ్యక్షులు, యువ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *