ప్రజా సమస్యల పరిష్కారమే నా ధ్యేయం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజా తంత్ర  నవంబర్ 23: సమస్యల పరిష్కారమే నా ధ్యేయమని, ప్రజా అవసరాలకు అనుగుణంగా మరిన్ని మౌలిక వసతులు కల్పించేందుకు ఎల్లవేళలా కృషి చేస్తానని, ప్రజలు ఆశీర్వదించి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే, ప్రభుత్వ ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజవర్గంగా తీర్చిదిద్దుతానని ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  పేర్కొన్నారు. గురువారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని శాతవాహన కాలనీ, కాకతీయ కాలనీ,బ్యాంక్ కాలనీ, ప్రగతి నగర్, నవోదయ కాలనీ, ఎస్.బి.హెచ్. వెంచర్ 1, 2 వారి సీనియర్ సిటీజన్ల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎల్.బి.నగర్ భారాస పార్టీ అభ్యర్థి, శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ సిటీజన్ల మద్దతు సుధీర్ రెడ్డికి తప్పకుండా ఉంటుందనిగుర్తు చేశారు. గతంలో చిన్నపాటి వర్షానికి కాలనీలు జలమయం కావడం జరిగేదని, మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు ప్రత్యేక చొరవ తీసుకుని ఎమ్మెల్యేకు పరిస్థితులు వివరించగా ఎమ్మెల్యే  స్పందించి బాక్స్ డ్రైన్స్ మంజూరు చేయడం జరిగిందన్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే కొన్నికొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని వాటిని కూడా పరిష్కారం చేయాలని కోరారు. నూతన బి.టీ.సీ.సీ. రోడ్లు,bపాత డ్రైనేజీ స్థానంలో నూతన డ్రైన్స్ నిర్మించాలని కోరారు. మెట్రో  స్టేషన్ వద్ద వాహనాల పార్కింగ్ కోసం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఇప్పటికే సీ.సీ.కెమెరాలు దాదాపు అమర్చడం జరిగిందని, మరో 10 సీ.సీ.కెమెరాలు ఎర్పాటు చేస్తే పూర్తి స్థాయిలో సీ.సీ.కెమెరాలు ఎర్పాటు చేసినట్టు అవుతుందని తెలిపారు. ఈ కాలనీలోకి రావడానికి యూటర్న్ ఎర్పాటు చేయాలని, చిన్నపిల్లలు ఆడుకోవడానికి నూతన పరికరాలు అమార్చాలని కోరారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు. దాదాపు ప్రధాన సమస్యలు పరిష్కారం చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని వాటిని కూడా ప్రణాళికబద్దంగా పరిష్కారం చేస్తామని తెలిపారు. అలాగే బాక్స్ డ్రైన్స్ విషయంలో ప్రతిపక్షలు అనవసర రాద్ధాంతం చేసిన వాటిని పట్టించుకోకుండా బాక్స్ డ్రైన్స్ పనులు విజయవంతంగా నిర్మించడం జరిగిందన్నారు. ఇప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చిన ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరదనీరు సాఫీగా ప్రవహిస్తోందని తెలిపారు. నియోజకవర్గ అబివృద్దే తన లక్ష్యమని, ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తనకు తెలుసు అని తెలిపారు. ఇప్పుడు కొత్తగా వచ్చేవారి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వారికి ఏ గల్లీ ఎక్కడ ఉందో తెలియదని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధి కోసం బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకులు మేక రాజశేఖర్ రెడ్డి, చిత్తలూరి వెంకటేశ్వర్లు, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త మధు సాగర్, మాజీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, తిలక్ రావు, రాకేశ్ టాగుర్, వెంకట్ రెడ్డి, ఆశిష్ కాలనీ వాసులు గోపాల్ రెడ్డి, కృష్ణ రెడ్డి, సంజీవ రావు, సతీష్ కుమార్, జయరాం, మోహన్ రెడ్డి, శ్రీనివాస్, పెద్ది సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *