ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం దేవిరెడ్డి సుధీర్ రెడ్డి

 ఎల్బీనగర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 11:  ప్రజల మధ్యనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఎల్.బి.నగర్ నియోజకవర్గ భారాస పార్టీ అభ్యర్థిగా మరోసారి అఖండ విజయం సాధించిన దేవిరెడ్డి సుధీర్ రెడ్డిని హయత్ నగర్ డివిజన్ పరిధిలోని భారస పార్టీ నాయకులు, మిదాని కాలనీ వాసులు పలువురు ముస్లిం పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్.బి.నగర్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం సుధీర్ రెడ్డితోనే సాధ్యం అని తెలిపారు. వారు చేసిన అబివృద్దే వారి విజయానికి కారణం అని అన్నారు. అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గన్నీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్, గుడాల మల్లేష్, చెన్నగొని మదన్ గౌడ్, గజ్జి అశోక్, గణేష్, కృష్ణ, జంగయ్య, భాస్కర్ గుప్తా, యాదగిరి, లింగం శ్రీను,చంద్రశేఖర్ రెడ్డి, అంజయ్య గౌడ్, సలీం, ఛాన్ పాషా, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *