ప్రజా యుధ్ధనౌక గద్దర్ పాటలు చిరస్మరణ్యం టియుఎఫ్ రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,ఆగస్ట్ 7మొయినాబాద్ మండల పరిధిలోని గల హిమత్ నగర్ చౌరస్తాలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు దేశమల్ల ఆంజనేయులు ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బేగరి రాజు అసైన్డ్ భూముల సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్  పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే కాకుండా తనదైన పాటలతో అందరిని కదిలించిన ప్రజా గాయకుడు గద్దరన్న ఇక లేరు అని ఆవేదన వ్యక్తం చేశారు.అమ్మా తెలంగాణమా ఆకలి కేకల కాలమా అంటూ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అంటూ తెలంగాణ ఉద్యమంలో తన గళంతో కోట్లది మందిని ఉత్తేజపరిచిన గొప్ప ప్రజా గొంతుక గద్దర్ అని గుర్తు చేశారు.తనపాటలతో ప్రజా చైతన్యానికి ఎనలేని కృషి చేసిన ప్రజా యుద్ధనౌక గద్దర్ ను కొనియాడారు.జన నాట్యమండలి స్థాపించి జనం కోసం గొంతెత్తి పాటలతో ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు ప్రజాయుద్దనౌక గద్దర్ నిష్క్రమణ తెలంగాణ సమాజానికి తీరని లోటుఅన్నారు.భౌతికంగా దూరమైనా గద్దర్ జ్ఞాపకాలు పాటల రూపంలో నిరంతరం ప్రజలను చైతన్య పరుస్తాయి అన్నారు.గద్దరన్న పాటల రూపంలో ప్రజల ముందున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *