ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమ యాత్ర సిద్ధం

ముషీరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 07 : ప్రజా యుద్ధ నౌక గద్దర్ అంతిమయాత్ర సిద్ధం అయ్యింది. అంతిమ యాత్ర వాహనంలోకి చేరుకున్న గద్దర్ పార్థీవదేహం, పోలీసుల గౌరవ వందనం, స్లో మార్చ్, డెత్ మార్చ్ లతో గన్ పార్క్ కు అంతిమయాత్ర బయలుదేరనుంది. గన్ పార్క్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఆల్వాల్ చేరుకోనుంది. మధ్యాహ్నం తరవాత అల్వాల్ వెంకటాపురం భూదేవి నగర్లోని గద్దర్ ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దర్  పార్థివదేహానికి నివాళులు అర్పించి కుటుంబసభ్యులను సీఎం కెసిఆర్ పరామర్శించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *