ప్రజా పాలన, అభయహస్తం అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి   కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి 

 ఉప్పల్, ప్రజాతంత్ర, జనవరి 3:  అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రజా పాలన, అభయహస్తం  ఆరు గ్యారెంటీ లకు దరఖాస్తు చేసుకోవాలని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి కోరారు.బుధవారం ఉప్పల్ డివిజన్ లోని శాంతినగర్ లో ప్రజా పాలన కేంద్రాన్ని  రజితా పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజాపాలనను అందుబాటులోకి తెచ్చారని గుర్తు చేశారు. గత పాలకులు ప్రజలను కలిసేందుకు కూడా ఇష్టపడలేదన్నారు. సంక్షేమ పథకాలు పేదలైన అర్హులకు అందలేదన్నారు.గత పాలనకు భిన్నంగా సీఎం రేవంత్ రెడ్డి  ప్రజావాణి ప్రజా పాలన వంటి కార్యక్రమాలతో ప్రజలకు మెరుగైన పాలనను అందిస్తున్నట్టుగా తెలిపారు. సీఎంగా రేవంత్ రెడ్డి  బాధ్యతలు చేపట్టిన వారంలోపే 6 గ్యారంటీలలో రెండు గ్యారెంటీలను అమలు చేశారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అన్ని పథకాలను అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ 6 గ్యారంటీలకు దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని సూచించారు.
 కార్యక్రమంలో ఏ బ్లాక్ ఎస్ సి సెల్ అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ,తిక్క ప్రకాష్, డివిజన్ ఉపాధ్యక్షులు అల్వాల భాస్కర్, జనరల్ సెక్రరీ జనగాం రామకృష్ణ,వర్కింగ్ ప్రెసిడంట్ ఏలుగుల అనీల్ కుమార్ దితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *