జగదేవపూర్, ప్రజాతంత్ర, డిసెంబర్ 30: జగదేవపూర్ మండల కేంద్రంలో ప్రజా పాలన కార్యక్రమం శనివారం సర్పంచ్ కొత్త లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధిగా మండల ప్రత్యేక అధికారి శివప్రసాద్, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి హాజరైనారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రజాపాలనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల వద్దకు ప్రజా పాలన తీసుకవచ్చిందని అన్నారు. ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ వసంత రావు, ఏఈఓ ఖలీల్, ఈవో హరి ప్రసాద్, ఐసిడిఎస్ సూపర్వైజర్ సునీత, గుబ్బ శ్రీనివాస్, వెంకట్ నర్సింహ్మ రెడ్డి, మచ్చ బిక్షపతి, గాల్ రెడ్డి,పాషా,అంగన్వాడీ టీచర్స్, ఆశ వర్కలు ఫీల్డ్ అసిస్టెంట్, సాంబయ్య, కారోబార్ బాలయ్య,పోలీస్ రమణ రెడ్డి, చందు, మారేడి, సిఏలు కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పాలనను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి





