సిద్దిపేట పట్టణంలోని అన్ని వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు అందుబాటులో ఉండాలి
దరఖాస్తు ఫారాలను ప్రజలకు అర్థమయ్యేలా వాటిని నింపి అవగాహన కల్పించాలి
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్
సిద్ధిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 28: ప్రజా పరిపాలనను ప్రజలకు అందించేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధికారులతో కలిసి వార్డుల్లో పర్యటించాలని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ కోరారు. సిద్దిపేటలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ డిసిసి అధ్యక్షుడు నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సూచనల మేరకు ప్రతి నాయకుడు కార్యకర్తలు రేపటి నుండి ప్రారంభమయ్యే ప్రజా పరిపాలన కార్యక్రమంలో అధికారులతో కలిసి భాగస్వామ్యం కావాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రజలకు మంచి సుపరిపాలన అందించేందుకు మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రజా పరిపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలపై నాయకులు కార్యకర్తలు ప్రజలకు వివరిస్తూ అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజలకు అర్థం కాకుంటే దరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వయంగా నింపి అధికారులకు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు మజార్ మాలిక్, యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గయాజుద్దీన్, ఎన్ ఎస్ యు ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ రశాడ్, నజ్జు, అయుబ్, ప్రభాస్, తదితరులు, పాల్గొన్నారు.





