హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 30 : తెలంగాణ ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై గజ్వేల్ లో పోటీ చేయనున్నట్లు సోషలిస్ట్ పార్టీ(ఇండియా) అధ్యక్షురాలు, తొలి, మలి దశ ఉద్యమాకారిణి రచ్చ సుభద్రరెడ్డి ప్రకటించారు. ఈ మేరకు సోమవారం హైదర్ గూడలోని ఎన్ఎస్ఎస్ లో పార్టీ మేనిఫెస్టోను ఆమె విడుదల చేసి తొలి జాబితాను ప్రకటించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్న, సన్నకారు రైతులకు మాత్రమే రైతు బంధు సంవత్సరానికి రూ.20 వేలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 61 నుండి 58కి తగ్గించి నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తామని ఇస్తామని ప్రధాన ఏజెండాతో సోషలిస్ట్ పార్టీ(ఇండియా) ముందుకు వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో మధ్యపాన నియంత్రణ, ప్రవేటు విద్యను నిషేదిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రంగాల వారికి అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తామన్నారు. సోషలిస్ట్ పార్టీ అంటేనే సమజా స్థాపన కోసం పాటు పడుతుందన్నారు. ప్రకటించిన తొలి జాబితాలో 14 మంది ఆర్.సుభద్ర రెడ్డి(గజ్వెల్), బివి.రమేష్ బాబు(గోషామహల్), పి.లక్ష్మణ్(రాజేంద్రనగర్), గోపాల్ పతంగేయ్(అంబర్‌పేట), రాజా గౌడ్(మలక్ పేట), షహజాది(సనత్‌నగర్), ఆర్.ధర్మ నాయక్(ఇబ్రహీంపట్నం), కె.లక్పతి నాయక్(దేవరకొండ), ఎం.శ్రీనివాస్(నాగార్జున సాగర్), ఎం.సైదయ్య(మిర్యాలగూడ)ల గెలుపు కోసం ప్రజలు కృషి చేయాలని కోరారు.
ప్రజా ధనాన్ని కొల్లగొట్టిన కెసిఆర్ పై పోటీ రచ్చ సుభద్రరెడ్డి





