ప్రజా ఆశీర్వాద సభకు భారీగా తరలిన పార్టీ శ్రేణులు

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 17: సిద్దిపేట నాగదేవత దేవాలయం శివారులో నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు మంగళవారం చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు ప్రతి గ్రామం నుండి బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మహిళలు,ప్రజలు వేలాదిగా తరలి వెళ్లారు.తెలంగాణ అభివృద్ధి ప్రదాత సిద్దిపేట ముద్దు బిడ్డ సిఎం కేసీఆర్ అంటూ.. మళ్లీ కారే కావాలి సారే రావాలి అని ముక్త కంఠంతో  నినాదాలు చేశారు. మేమంతా హరీష్ రావు, కేసీఆర్ వెంటే ఉంటాం అంటూ భారీ బైక్ ర్యాలీతో యువత బయలు దేరి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *