రోజుకో ట్విస్ట్‌తో ఫోన్ ట్యాపింగ్ వ్యవహా రం సంచలనం సృష్టిస్తుంది. ఇజ్రాయెల్ కు చెందిన ‘పెగాసస్’ ఫోన్ ట్యాపింగ్ నిఘా సాఫ్ట్ వేర్ పుణ్యమాని బీఆర్‌ఎస్ కు కోలుకొ ని షాక్ తగిలింది. కేసీఆర్ ప్రభుత్వం హ్యాకింగ్ కు పాలపడిరదన్న ఆరోప ణలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరుగుచున్న పరిణా మాలతో బలం చేకూరింది.
కేసీఆర్ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టడానికి ప్రతిపక్ష నాయకుల కదలికలను పసిగట్టేందుకు నిఘా పెట్టింది. ప్రజలు మార్పుకోవడంతో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం తీగ లాగితే డొంక కదిలినట్టు ఎస్‌ఐబి ఫోన్ ట్యాపింగ్ కేసులో డిఎస్పీ ప్రణీత్ రావు ద్వారా వెలుగులోకి వస్తున్నా అంశాలు రోజుకో మలుపు తిరుగుతూ నివ్వెరపోయేలా ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇప్పటి వరకు అరెస్టు అయినా అధికారులు చెప్పిన పేరు నాడు ప్రతిపక్ష నేత రెండు ఏండ్ల క్రింద ఆరోపించిన ప్రభాకర్ రావు అనేది స్పష్టంగా కన్పిస్తుంది. రేవంత్ బహిరంగంగానే కబడ్డీ ఆడినారు కదా? అటువంటిది అయన నివాసం అడ్డగా ట్యాపింగ్ చేసి అధికారం కోల్పోయినారు తప్ప, సాధించింది ఏమి లేదు కదా? స్వంత మనుషులు సైతం తాగి, తడిపి మాట్లాడిన అంశాలతో బేజారయ్యే పరిస్థితి తప్పినా.. అధికారమార్పిడి జరగి, ఫోన్ ట్యాపింగ్ తో బడా, బడా నేతల మైండ్ బ్లాంక్ అయ్యే విషయాలు బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత దాని ప్రభావం తీవ్రంగా ఉండే ప్రమాదం ఉందనే అభిప్రాయం ఏర్పడిరది. ట్యాపింగ్ చేసిన డేటాను ధ్వంసం చేసేందుకు బందిపోట్లు ఉపయోగించిన విధంగా కట్టర్లు వాడి హార్డ్ డిస్క్ దొంగలించి అడవి పాలు చేయడాన్ని పౌరసమాజం తప్పుపడుతుంది. ప్రభాకర్ రావు నోరు విప్పుతేకాని అసలు కుట్రదారులెవరనేది తేలదంటే అతిశయోక్తి కాదు. నాడు కేంద్రంపై ఆరోపణలు చేసిన కేసీఆర్ నాయకులను చెప్పుచేతుల్లో పెట్టుకోవడానికి కేంద్రం అవలంబించిన ‘పెగాసస్’ నిఘాతో నమ్ముకొని బొక్కా బోర్లా పడ్డారనే విమర్శ ఉంది.
మోడీ ప్రభుత్వం కేసీఆర్ ను కట్టడి చేసేందుకు ఫోన్ ట్యాపింగ్ చేస్తుందనే బలమైన ఆరోపణ నాటి తెలంగాణ ప్రభుత్వం చేసింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ సహాయంతో అనుమానిత స్వపక్ష, విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాకింగ్ చేసి వారి వ్యక్తిగత సంభాషణలు, గోప్యతను బట్టబయలు చేసేందుకు అధికార వర్గాలు కుట్ర చేస్తున్నారని, 2021 జూలై మాసంలో అంతర్జాతీయ స్థాయి మీడియా బ్రేకింగ్ న్యూస్ గా కథనాలు వెలువడ్డాయి. అలర్ట్స్ గమనించిన ప్రముఖ జర్నలిస్టులు అనుమానంతో ల్యాబ్ కి పంపి పెగాసస్ సాఫ్ట్ వేర్ హ్యాకింగ్ లో చిక్కుకున్నారని ‘ది వైర్ వార్తా సంస్థ వెబ్సైట్’ ఎడిటర్ సిద్దార్థ్,ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్సన్ రిపోర్ట్ ప్రాజెక్టు సౌత్ ఆసియా ఎడిటర్ ఆనంద్ మంగాల్నే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని అమినిస్ట్రీ ఇంటర్ నేషనల్ సంస్థ వెల్లరించింది.గతంలో విపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ సాక్షిగా ఫోన్ల హ్యాకింగ్ పై నిలదీశారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఇదే తరహాలో విమర్శలు చేసాయి.ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు ప్రణాళిక ప్రకారం యాపిల్ సంస్థపై ఒత్తిడి తెచ్చి,వచ్చిన సందేశాలు మేమే స్వయంగా పంపించామని చెప్పించి బుకాయించింది. నాడు మహాభారతంలో ధర్మరాజు అశ్వత్థమా హతః కుంజరః అన్నట్లుగా కప్పి పుచ్చుకోవడానికి ఈ సమస్య మనదేశానికే కాదు,ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లోని ఐఫోన్ యూజర్స్ అందరికి అలర్టులు వెల్లినాయని ప్రసిద్ధి గాంచిన ఆపిల్ సంస్థ నమ్మబలికింది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు టార్గెట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగిందనే ఆరోపణ టిడిపి చేసింది. ఎమ్మెల్యేల ఎరా కేసులో ట్యాపింగ్ కీలకంగా మారిందనే బీజేపీ ఆరోపణ చేసింది. ఒకానొక సమయంలో నాటి తెలంగాణ గవర్నర్ తమిళసై నా ఫోన్ కూడా ట్యాపింగ్ చేస్తున్నారని బలంగా ఆరోపించారు.యూపీఏ రెండు సార్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతలవే కాకుండా మిత్రపక్షాల నేతల ఫోన్లు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి.
తెలంగాణలో ఎలాగైనా అధికారం నిలుపుకోవాలన్న తాపత్రయంతో అధికార పక్షమైన భారత రాష్ట్ర సమితి అనుమానిత స్వపక్షం, విపక్షం లోని శత్రువుల డేటా సేకరించి ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసింది. జుకర్ బర్గ్ చేసింది ప్రపంచ స్థాయి కుంభకోణం అయితే కావచ్చు కానీ, కేసీఆర్ పాల్పడిరది రాష్ట్ర స్థాయి ఫోన్ ట్యాపింగ్ అయినా చాలా తీవ్రమైంది. మావోయిస్టుల పేరుతో ఇజ్రాయిల్ ,రష్యా నుంచి అత్యాధునిక పరికరం దిగుమతి చేసుకొని వ్యక్తిగత సమాచారం సేకరించడం, విపక్ష నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల సంభాషణలను దొంగిలించడం చట్టరీత్య నేరం ఇలాంటి చట్ట,వ్యతిరేక కార్యకలాపాలకు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు పూనుకోవడం అనైతికంగా భావిస్తున్నారు.సరిగ్గా ఐదేండ్ల క్రింద కేంబ్రిడ్జ్ అనాలిటికా అనే కంపెనీ వార్లల్లోకెక్కింది.ప్రజల వ్యక్తిగత వివరాలు సేకరించి, దాన్ని రాజకీయ పార్టీలకు అమ్ముకుందని పెద్ద దుమారమే రేగింది.కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ ద్వారా లబ్ది పొందాలనుకోవడం చట్టరీత్య నేరం.విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం చేస్తామంటే సైబర్ క్రైమ్ చూస్తూ ఊరుకోదు.1988లో కర్ణాటకలోని రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం ట్యాపింగ్ తోనే కుప్పకూలింది. వ్యక్తిగత గోప్యత, ప్రాథమిక హక్కుల కు భంగం కలిగించిన దశాబ్దాలుగా భారీ మూల్యం చెల్లించుకున్నాయి.రెండు ఫోన్లు ట్యాప్ చేస్తే ఏమైతదని టికునాలు తీయడం సమాజం తప్పుపడుతుంది.నాయకులు తమ ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను నెరవేర్చుకునేందుకు ప్రణీత్ రావును పణంగా పెట్టినారనే భావం నెలకొంది. ప్రభుత్వాలు వస్తుంటాయి,పోతుంటాయి కానీ అధికారదాహంతో ఇజ్రాయిల్, రష్యా నిఘా పరికరాలు పెట్టి ప్రజాస్వామిక విలువలకు భంగం కల్గించి బీఆర్‌ఎస్ నిండా మునిగిందనే అభిప్రాయం ఏర్పడిరది. ఈ తతంగంలో కేసీఆర్ సామాజిక వర్గం క్రియాశీలకంగా పనిచేయడం గమనార్హం. ి
డా. సంగనిమల్లేశ్వర్
విభాగాధిపతి, జర్నలిజం శాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం,
వరంగల్,
సెల్ : 9866255355





