సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 11: “ప్రజావాణి జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలను విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం అని జిల్లా పాలనాధికారి ప్రశాంత్ జే పాటిల్ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లా రెవెన్యూ అదనపు పాలనాధికారి శ్రీనివాస్ రెడ్డి తో కలిసి అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ… జిల్లా నలుమూలల నుండి తమ సమస్యలు నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జిదారులు ఎంతో ఆశతో కార్యలయంకి వస్తారని వారందరికీ న్యాయం చేయడం అధికారులుగా మన కర్తవ్యం అని జిల్లా అధికారులకు తెలిపారు. అర్జిదారుల నుండి తీసుకున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించి నివేదిక అందించాలి. అర్జిదారులకు ప్రజావాణి కార్యక్రమం పైన నమ్మకం పెరిగిందని క్రమక్రమంగా అర్జిదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహం తో పనిచేయ్యాలన్నారు. వివిధ సమస్యలపై మొత్తం 26 దరఖాస్తులు అందాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నాగ రాజమ్మ, డీఆర్డీఏ పిడి జయదేవ్ ఆర్యా, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణి గొప్ప కార్యక్రమం జిల్లా కలెక్టర్




