సిద్దిపేట, ప్రజాతంత్ర, డిసెంబర్ 27: సిద్దిపేట లో నిర్వహించిన పత్రిక సమావేశంలో పూజల హరికృష్ణ మాట్లాడుతూ నేడు 28వ తేదీ నుండి జనవరి 6వ తేదీ వరకు ప్రతి గ్రామాలలో,మండలలో,మున్సిపాలిటీ, పరిధిలో ప్రజా పాలన ప్రారంభం కాబోతుంది.నేటి నుండి ప్రారంభం అవుతున్న ప్రజ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ప్రభుత్వ పథకాలను అందుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క అర్హులు మీ యొక్క గ్రామాలలో ,మండలల్లో,మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ప్రజా పాలన కేంద్రం కి వెళ్లి మీకు కావాల్సిన పథకాలను ఫారం లు నింపి అక్కడ ఉన్న అధికారికి ఇవ్వగలరు అని అన్నారు.ప్రజలకు ఏదైనా సందేశలు ఉంటే ప్రభుత్వనికి ప్రజలకు అనుసంధానం గా వరదిలాగా పనిచేయడానికి అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు అందుబాటులో ఉంటారని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీనాయకులకు,కార్యకర్తలకు, శ్రేణులకు,అభిమానులకు ప్రజ పాలనలో కౌంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు సహాయ పడాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా వృదులకు, వికలాంగులకు,మహిళలకు,పురుషులకు, ప్రతేక లైన్ లు కేటాయించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలల్లో రెండు పథకాలు మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు,చేయూత కింద రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం 10 లక్షల బీమా ఇప్పటికే అమలు చెయ్యడం జరిగింది.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపే మిగతా 4 పథకాలకు సంబంధించిన అప్లికేషనులను నేటి నుండి ప్రారంభిస్తుంది.ఇలాంటి పథకాలను గూర్చి తెలియక తప్పు తొవ్వ పట్టిస్తున్న బీఆర్ఎఎస్ పార్టీ నాయకులు బురద చల్లలని చూస్తున్నారు. కాబట్టి ప్రజల వల్ల మాటలు నమ్మి మోసపోవద్దు అని అన్నారు.ప్రజల కోసం ప్రజల కష్టం తీర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారని ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి గంప మహేందర్,సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి,కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నాయిని నర్సింహారెడ్డి, మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ కాలీముద్దీన్,సీనియర్ నాయకులు,శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు యాదగిరి,చందూభాయ్,వాహబ్,ఆర్షద్, అజ్మత్,మున్నా,సీత బాలు,బైరి శంకర్,ప్రతాప్, వంశీ, పవన్,అజ్మత్,తదితరులు పాల్గొన్నారు.
ప్రజాపాలన ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపిన సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ




